Wednesday 25 March 2020

అమెరికా లాక్ డౌన్ ప్రకటిస్తుందా?


అమెరికా లాక్ డౌన్ ప్రకటిస్తుందా?
 

కరోనా వైరస్ అన్ని దేశాలతో  పాటు అగ్ర రాజ్యమైన అమెరికాను కూడా వణికిస్తోంది. ఇప్పటికే 550 మంది మరణించారు.   భారత్‌తో  సహా అన్ని దేశాలు నెమ్మదిగా లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఎందుకంటే రోజురోజుకు దీని బారిన పడే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది.

ఈ సమయంలో అగ్ర రాజ్యమైన అమెరికా లాక్ డౌన్ ఇంకా ప్రకటించలేదు . అక్కడి డాక్టర్లు అన్ని దేశాల మాదిరి లాక్ డౌన్ చేయాలని ప్రెసిడెంట్ ట్రంప్‌కి సూచించారు. దానికి ట్రంప్ నిరాకరించారని సమాచారం. అమెరికా  లాక్ డౌన్ చేస్తే ప్రపంచ ఆర్ధిక వ్యవస్థపై ప్రభావం  పడుతుందని ట్రంప్ అభిప్రాయ పడుతున్నట్టు తెలుస్తోంది. అందుకే లాక్ డౌన్ చేసే అవకాశం తక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. 

No comments:

Post a Comment