Tuesday 7 April 2020

ఏప్రియల్ 14 తర్వాత లాక్ డౌన్‌ని 2-3 వారాలు పొడిగించే అవకాశం ఉందా?


ఏప్రియల్ 14 తర్వాత లాక్ డౌన్‌ని 2-3 వారాలు పొడిగించే అవకాశం ఉందా?    

 

నిన్న  తెలంగాణ ముఖ్యమంత్రి  కె. చంద్ర శేఖర్ రావు విలేఖరులతో  సమావేశమయ్యారు. ఈ సమవేశంలో ముఖ్యంగా మాట్లాడిన విషయాల్లో  ఒకటి లాక్డౌన్ పొడిగింపు. ఇప్పుడున్న పరిస్థితి  నుండి బయట పడాలంటే లాక్ డౌన్ పొడిగిచాల్సిన  అవసరం తప్పకుండా ఉంది. కరోనాని ఎదుర్కోవడానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో లాక్ డౌన్  ఒక్కటే మన ముందున్న మార్గం అని చెప్పారు.

ఆయన మట్లాడుతూ, తనైతే లాక్ డౌన్ పొడిగించడమే మంచిదని, ఇదే విషయాన్ని మన ప్రధాని నరేంద్ర మోడి గారికి కూడా చెప్పడం జరిగిందని చెప్పారు. కానీ ఎప్పటి వరకు పొడిగిస్తారని మాత్రం ఇంకా నిర్ణయించాల్సి  ఉంది. అయితే ఆయన మాటలనుబట్టి 2-3 వారాలపాటు ఈ లాక్ డౌన్‌ని పొడిగించే అవకాశం ఉందని అనిపిస్తోంది.   

ఈ సందర్భంగా ఆయన జిహెచ్ఎంసి మరియు మున్సిపల్  వర్కర్లకు, వైద్య సిబ్బందికి  ప్రభుత్వం తరుపున ప్రోత్సాహకాలను ప్రకటించింది.  

వైద్య సిబ్బందికి గ్రాస్ సాలరీలొ 10% సీఎం గిఫ్ట్‌గా ప్రకటించారు.

పారిశుద్య సిబ్బందికి కట్ చేసిన 10% జీతం వెంటనే ఇస్తామని సీఎం ప్రకంటిచారు.

జిహెచ్ఎంసి సిబ్బందికి రూ.7500 సిఎం గిఫ్ట్ ప్రకటించారు.

మున్సిపాలిటీల్లొ పారిశుద్ధ్య సిబ్బందికి రూ. 5000 సిఎం సాయం ప్రకటించారు.  దీన్ని ఈరోజే రిలీజ్ చేస్తామన్నారు.     

ఇంకా ఇలాంటి ప్రోత్సహకాలు కష్టపడి కరోనా కట్టడికి క్రుషి చేసే ప్రభుత్వ ఉద్యోగులకు అందిస్తామని ఆయన తెలిపారు.

No comments:

Post a Comment