Wednesday 8 April 2020

జియో కస్టమర్లకు గుడ్ న్యూస్...


ఇప్పుడు ఏటీఎం కార్డు ద్వారా రీచార్జ్ 



జియో సంస్థ తన వినియోగదారులకు గుడ్ న్యూస్ అందించింది. ఇప్పుడు మీరు మీ బ్యాంక్ ఏటీఎం ద్వారా జియో రీచార్జ్ చేసుకోవొచ్చు. 

ఇప్పుడు మీరు మీదగ్గరలో ఉన్న  ఏటిఎం ద్వారా క్షణాల్లో మీ జియో రీచార్జ్ చేసుకోవొచ్చు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, సిటీ బ్యాంక్, డీసీబీ బ్యాంక్, ఏయూఎఫ్ బ్యాంక్, స్టాండర్డ్ ఛార్టర్డ్ బ్యాంకులలో  ఈ సదుపాయం కలదు.  

ఏటీఎం ద్వారా జియో ఎలా రీచార్జి చేసుకోవాలో చూద్దాం.

ముందుగా మీ డెబిట్ కార్డుని ఇన్సర్ట్ చేయండి.

మెనులో రీచార్జి ఆప్షన్‌ని సెలెక్ట్ చేయండి.

తరువాత మీ 10 అంకెల మొబైల్ నంబర్‌ని ఎంటర్ చేయండి.

ఎంత ఎమౌంట్ రీచార్జి చేయాలనుకుంటారో అంత అమౌంట్ ఎంటర్ చేసి, కన్ఫర్మ్   చేయండి.  వెంటనే రీచార్జి అయినట్టు మెసేజ్ వస్తుంది. 

రీచార్జి అమౌంట్ మీ బ్యాంక్ ఖాతానుండి డెబిట్ అవుతాయి. మీ జియో రీచార్జి అయినట్టు మెసేజ్ వస్తుంది.

No comments:

Post a Comment