Saturday 25 April 2020

మీరు హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా, అయితే మీకు శుభవార్తే


మీరు హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా, అయితే మీకు శుభవార్తే.



అవునండీ, ఎల్ఐసి హౌజింగ్ ఫైనాన్స్ లిమిటెడ్హోమ్ లోన్ తీసుకోవాలనే వారికి అతి తక్కువ వడ్డీతో హోమ్ లోన్ అందించనుంది. ఎల్ఐసిహెచ్ఎఫ్ఎల్ ఎల్ఐసి అనుబంధ సంస్థ. ఇది హోం లోన్స్ ఇచ్చే పెద్ద సంస్థల్లో ఒకటి అని చెప్పొచ్చు.

అయితే ఎల్ఐసిహెచ్ఎఫ్ఎల్ సిబిల్ స్కోర్ 800 కంటే ఎక్కువగా ఉన్న కొత్త కస్టమర్లకు 7.50 శాతానికే హోమ్ లోన్ ఇస్తామని ప్రకటించింది. ఇంతకుముందు వడ్డీ రేటు  8.10 శాతంగా ఉండేది.  ఒకటేసారి 60 బేసిస్ పాయింట్లు తగ్గించి హోమ్ లోన్ అందిస్తోంది.  మంచి సిబిల్ స్కోర్ కలిగి ఉన్నవారికి ఇది  చాలా మంచి అవకాశం. 

అంతే కాకుండా ఎల్ఐసిహెచ్ఎఫ్ఎల్ వారి దగ్గర తీసుకునే లోన్కి సమానంగా సింగిల్  టర్మ్ అష్యురెన్స్ పాలసీ  తీసుకునే వారికి   ఇంకొక 10 బేసిస్ పాయింట్లు తగ్గించి 7.40 శాతం వడ్డీకే హోమ్  లోన్ ఇస్తామని  వారు ప్రకటించారు.

No comments:

Post a Comment