Friday 24 April 2020

చిన్నోడికి ఛాలెంజ్ విసిరిన పెద్దోడు


చిన్నోడికి ఛాలెంజ్ విసిరిన పెద్దోడు  



జూ. ఎన్టీఆర్ సీనియర్ హీరోలకు ఛాలెంజ్ విసిరిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా విక్టరీ వెంకటేష్ తారక్ చాలెంజ్‌ని స్వీకరించి, తన గార్డెన్ మరియు ఇంట్లో చేసిన పనులకు సంబందించిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. దీనిలో భాగంగా విక్టరీ వెంకటేష్ వెజిటెబుల్ కర్రీ కూడా చేసాడు.   

అయితే  విక్టరీ వెంకటేష్ తన సిల్వర్ స్క్రీన్ చిన్నోడికి (అదేనండి మన సూపర్ స్టార్ మహేష్ బాబు), మెగా హీరో వరుణ్ తేజకి మరియు డైరెక్టర్ అనిల్ రావిపూడికి ఈ ఛాలెంజ్‌ని విసిరాడు.        

అయితే అందరు స్టార్స్ తాము పనిచేస్తున్న వీడియోలను పోస్టు చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. అయితే తమ హీరో ఇంటి పనులు చేస్తున్న విడియో చుడాలని మహేష్ బాబు ఫాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరి మహేష్, అభిమానుల కోరిక మేరకు ఈ ఛాలెంజ్‌ని స్వీకరించి  తాను ఇంట్లో పని చేసే విడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారో లేదో చూడాలి.    

No comments:

Post a Comment