Friday 17 April 2020

వకీల్ సాబ్ ఇక దసరా బరిలోనే ....


వకీల్ సాబ్ ఇక దసరా బరిలోనే ....

 

పవన్ కళ్యాణ్ ఇన్ని రోజులు రాజకీయాల కారణంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. అయితే ఇప్పట్లో ఎలక్షన్లు లేకపోవడంతో, సినిమాలకు  సైన్ చేస్కుంటూ వెల్తున్నాడు. అందులో భాగంగా బాలివుడ్ సినిమా పింక్ కి రిమేక్‌గా వకీల్ సాబ్ గా వస్తున్నాడు. అయితే ఈ సినిమా అనుకున్న ప్రకారం అన్ని జరిగి ఉంటే వచ్చే నెల మే లో రిలీజ్ కావల్సి ఉండేది. కాని కరోనా వల్ల దేశం మొత్తం లాక్‌డౌన్ అయిన సంగంతి తెలిసిందే. దీని వల్ల అన్ని సినిమాల షూటింగ్స్ నిలిచిపోయాయి.    

ఈ సినిమా 70 శాతం పూర్తయింది. లాక్‌డౌన్‌ని మే 3 వరకు పొడిగించడం వలన ఈ సినిమా మే నెలలో  విడుదల చేసే అవకాశం లేదు. మే నెల తర్వాత పెద్దగా  హాలిడేస్  ఏమి లేవు. కాబట్టి ఈ సినిమా  రిలీజ్ చేయడానికి మంచి టైం దసరా మాత్రమే అని ఈ చిత్ర నిర్మాత భావిస్తున్నట్టు తెలుస్తోంది.  

పవన్ కళ్యాణ్ ఫాన్స్ సమ్మర్‌లో తమ హీరో సినిమాని మిస్ అయినట్టే అని చెప్పాలి.    

No comments:

Post a Comment