Wednesday 3 June 2020

ప్రముఖ సిమెంట్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.


ప్రముఖ సిమెంట్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.


ప్రతీ సంస్థ ఒకప్పుడు బ్రాండ్ అంబాసిడర్లుగా బాలీవుడ్ సేలేబ్రిటిలనే సంప్రదించేవారు. దాన్ని అన్ని భాషల్లోకి డబ్బింగ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్టితులు మారిపోయాయి. బడా కంపనీలు కూడా ప్రాంతాల వారిగా సేలేబ్రిటిలను బ్రాండ్ అంబాసిడర్లుగా ఎంచుకుంటున్నారు. ఉదాహరణకు మహేష్ బాబు, అల్లు అర్జున్, జూ. ఎన్టిఆర్, రానా ఇలా మన స్టార్స్ రోజు ఏదో ఒక సంస్థ ఉత్పతిచేసే వస్తువులకు అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు.

వరుణ్ తేజ్  ప్రముఖ సిమెంట్ సంస్థ అయిన నాగార్జున సిమెంట్ కి  బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనున్నాడు. నాగార్జున సిమెంట్ వారు వరుణ్ తేజ్ తో  ఒప్పదం కుదుర్చుకున్నట్టు ఒక  ప్రకటనలో వెల్లడించింది. దీనికి గాను వరుణ్ తేజ్ కి  ఎంత మొత్తం ముట్టనుందో మాత్రం వెల్లడించలేదు.

ఫిదా, తొలిప్రేమ, గద్దలకొండ గణేష్ తో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్  ని సంపాదించుకున్నాడు.  
ప్రస్తుతం వరుణ్ తేజ్ బాక్సింగ్ నేపథ్యం లో ఒక సినిమా చేస్తున్నాడు.

No comments:

Post a Comment