Monday 28 September 2020

మెగాపవర్ స్టార్ “చిరుత”కి 13 ఏళ్ళు.....

 

                   Image Source: Twitter / @AlwaysRamCharan     


13 ఏళ్ళ క్రిందట ఈ రోజు తెలుగు సినిమా ఇండస్ట్రికి ఒక స్టార్ హీరో పరిచయమయ్యాడు. అతడే మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ . 13 ఏళ్ళ క్రితం అంటే 28 సెప్టెంబర్ 2007 న రామ్ చరణ్ మొదటి సినిమా “చిరుత” విడుదలైంది.

 రామ్ చరణ్ ని సినిమా ఇండస్ట్రికి పరిచయం చేసే భాద్యతను పూరి జగన్నాథ్ కి అప్పజెప్పాడు మెగాస్టార్ చిరంజీవి. నిర్మాణ భాద్యతలను తనతో ఎన్నో మంచి బ్లాక్ బస్టర్ సినిమాలు తీసిన వైజయంతి మూవీస్ అశ్వినీ దత్ కి అప్పగించారు. అప్పటికి పూరి జగన్నాథ్ మహేష్ బాబుతో తీసిన  “పోకిరి” సినిమా  బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో,  మంచి ఫాంలో ఉన్నాడు. దాని తరువాత  అల్లు అర్జున్ తో “దేశముదురు” సినిమాని తీసి మెగా క్యాంప్ లోకి ఎంటర్ అయ్యాడు.

“చిరుత” సినిమా తో రామ్ చరణ్ మెగా పవర్ స్టార్  రామ్ చరణ్ గా మారాడు. ఈ సినిమా  ద్వారా అభిమానులు మెగా వారసునికి తెలుగు సినిమా ఇండస్ట్రి లోకి ఘన స్వాగతం పలికారు.

మెగా వారసునితో పాటు, పూరి జగన్నాథ్ దర్శకత్వం, అలీ కామెడి, మణి శర్మ సంగీతం ఈ సినిమాకి అప్పట్లో  మంచి క్రేజ్ ని తీసుకొచ్చాయి. ఈ సినిమా పాటలు ఇప్పటికి అలరించే విధంగా ఉన్నాయి. అభిమానులు మెగా వారసత్వంగా భావించే డాన్స్ విషయంలో మొదటి సినిమాతోనే రామ్ చరణ్ 100 మార్కులు కొట్టేసాడనే చెప్పొచ్చు.  మణిశర్మ సంగీతం, లారెన్స్ కోరియోగ్రఫీ ఇందుకు బాగా దోహద పడ్డాయి.

దర్శకుడు పూరి జగన్నాథ్ గారికి కి పుట్టిన రోజు శుభాకాంక్షలు 

           Image Source: Twitter / @AlwaysRamCharan

అయితే ఈ సినిమా విడుదల రోజే దర్శకుడు పూరి జగన్నాథ్ పుట్టిన రోజు కావడం విశేషం.  పూరి జగన్నాథ్ వైవిధ్యభరితమైన సినిమాలతో  తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. చిన్న హిరోలకైనా స్టార్డం క్రియేట్ చేయగల సత్తాగల దర్శకుడు అని చెప్పొచ్చు. “పోకిరి” సినిమాతో ఇండస్ట్రి రికార్డులను  బద్దలు కొట్టాడు. తన తమ్ముడు సాయి శంకర్ ని కూడా హీరోగా పరిచయం చేసాడు. తన కొడుకు పూరి ఆకాష్  ని పరిచయం చేస్తూ “మెహబూబా” సినిమా తీసాడు. ఈ సినిమా అంచనాలను మించి బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడిందని చెప్పొచ్చు.

మధ్యలో సరైన హిట్స్ లేకపోవడంతో కొంత వెనుక పడినట్టు కనబడినా, జూ.ఎన్టిఆర్ టెంపర్ సినిమా తో మళ్ళి ఫాంమ్ లోకి వచ్చాడని చెప్పొచ్చు.  గత ఏడాది విడుదలైన  “ఇస్మార్ట్ శంకర్”  సినిమాతో ఒక్కసారిగా తెలుగు సిమిమా ఇండస్ట్రిని తనవైపు చూసేలా చేసాడు. హీరో “రామ్” నటించిన ఈ సినిమా బ్ల్లాక్ బస్టర్ హిట్ గా, రామ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. దీంతో పూరి మళ్ళి ట్రాక్ లోకి వచ్చాడనే చెప్పొచ్చు.

ప్రస్తుతం పూరి అర్జున్ రెడ్డి స్టార్ విజయ్ దేవరకొండ తో ఫైటర్ అనే సినిమా ప్రారంభించారు. కరోనా వల్ల  ఆగిపోయిన షూటింగ్ త్వరలోనే మొదలయ్యే అవకాశముంది. త్వరలోనే ఈ సినిమా విశేషాలని చిత్ర యూనిట్ ప్రకటించే అవకాశముంది.

ప్రస్తుతం రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తున్నాడు.

మరోసారి సినిమా అభిమానుల తరుపున హ్యాప్ బర్త్ డే టు పూరి జగన్నాధ్ గారు.


No comments:

Post a Comment