పండుగ అంటే మనకు గుర్తు
వచ్చేది చుట్టాలందరూ ఒకే దగ్గర కలుసుకోవడం, అందరు కలిసి పిండి వంటలతో పాటు వారి
అభిరుచులకు తగ్గ వంటకాలను చేసుకొని తినడం, ఆ ఊర్లో ఉన్న దేవాలయాలకు వెళ్ళడం, ఎన్నోరోజులకో కలవని పాత స్నేహితులను
కలుసుకోవడం, ఇంకా ఎన్నో రకాల ఆనందాల మద్య పండుగలు జరుపుకుంటారు. మనదేశంలో ప్రాంతాల
వారిగా వాళ్ళ ఇంటి లేదా ఊరి ఆచార వ్యవహారాలను బట్టి పండుగలను జరుపుకుంటూ ఉంటారు.
అయితే ఈ జనరేషన్లో ఉన్న
వారు ఏ పండుగ అయిన, వాట్స్ఆప్, ఫేస్ బుక్ మరియు ఇతర సోషల్ మీడియా ద్వారా
గ్రీటింగ్స్ తెలుపుకుంటూ పండుగలను
జరుపుకోవడం జరుగుతోంది. అందరు యాంత్రిక జీవనాన్ని గడుపుతున్నారని అనడంలో
సందేహం లేదు. ఒకప్పుడు వారి పల్లెలకు / స్వస్థలాలకు వెళ్లి బంధువులు, స్నేహితుల
మద్య పండుగలను సంబరంగా జరుపుకునే వారు.
కానీ ఈ యాంత్రిక జీవనం కారణంగా ఇప్పుడు
పండుగలను సెలవు దినాలుగా పరిగణిస్తున్నారు. కాబట్టి మన పండుగల గురించి, వాటి
విశిష్టతల గురించి ఈ జనరేషన్/ రాబోయే జనరేషన్ వాళ్ళకి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా
ఉంది.
భారత దేశం లో హిందూ
సాంప్రదాయ పండుగలు చాలానే ఉన్నాయి. ఉగాది, శ్రీరామ నవమి, వినాయక చవితి, దసర / విజయ
దశమి, దీపావళి, సంక్రాంతి, మహా శివరాత్రి, హోలీ ఇలా చాలా పండుగలు ఉన్నాయి. అలాగే ప్రతీ పడుగకి ఒక ప్రత్యేకత, విశిష్టత ఉంది. భారత
దేశంలో కొన్ని పండుగలు ప్రాంతాల వారీగా
జరుపుకుంటారు. ఉదాహరణకు, తెలుగు రాష్ట్రాల వారు ఉగాది పండుగ, కేరళ రాష్ట్ర ప్రజలు
ఓనమ్ పండుగ, గుజరాత్, ఇలా వివిధ రాష్ట్రాల వారు వారి సాంప్రదాయాలకు అనుగుణంగా పండుగలను
జరుపుకుంటారు. అందుకే భారత దేశంలో పండుగల సంఖ్య చాలా ఎక్కువ అని చెప్పొచ్చు.
ఈ ప్రయత్నంలో భాగంగా మన పండుగలకు సంబంధించిన విషయాలను,విశేషాలను,
ప్రాముఖ్యతను వివిధ మాధ్యమాల ద్వారా
సేకరించి, అవన్నీ మీ ముందు ఉంచబోతున్నాము.
No comments:
Post a Comment