Monday 28 September 2020

తెలంగాణ : దసరా రోజు నుండి అందుబాటులోకి రానున్న ధరణి పోర్టల్

 

Image Source: Google

తెలంగాణలో జరుపుకొనే పెద్ద పండుగ దసరా పండుగ. దసరా పండుగ రోజు చాలా మంది కొత్త పనులను ప్రారంభిస్తారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం, దసరా పండుగ రోజున ధరణి పోర్టల్ ని ప్రారభించనుంది. దీనికి సంబందించిన పనులు త్వరగా పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు సీఎం కేసిఆర్ ఆదేశాలు జారీ చేసారు. ఎట్టి పరిస్థితుల్లో దసరా రోజున ధరణి పోర్టల్ ని ప్రారంభించాలని, దానికి సంబందించిన, అవసరమైన  సాఫ్ట్ వేర్ , హార్డ్ వేర్, బ్యాండ్ విడ్త్ లను సిద్ధం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. 


అయితే మారిన రిజిస్ట్రేషన్ విధానం, వెంటనే మ్యుటేషన్ చేయడం, ధరణి పోర్టల్‌లో వివరాలను అప్‌డేట్ చేయడం వంటి అంశాలపై, తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్‌లకు శిక్షణ ఇవ్వనున్నట్లు సీఎం కేసిఆర్ తెలిపారు.


ధరణి పోర్టల్ డెమో ట్రయల్ నిర్వహించి అధికారులకు అవగాహన కల్పించాలని, ప్రతీ మండలం, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఒక కంప్యూటర్ ఆపరేటర్ నియామకాన్ని పూర్తి చేయాలని సిఎం కేసిఆర్ ఆదేశించారు.


అయితే ధరణి పోర్టల్ ప్రారంభం కాకముందే తెలంగాణ వ్యాప్తంగా  అన్ని సర్వే నంబర్ల ఆధారంగా రిజిస్ట్రేషన్ ధరలను నిర్నయించనున్నట్లు, ఆ ధరల ప్రకారమే  రిజిస్ట్రేషన్లు జరుగుతాయని  సీఎం కేసిఆర్ తెలిపారు. అలాగే తహశీల్దార్, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో డాక్యుమెంట్ రైటర్లకు లైసెన్స్ లు ఇచ్చి వారికి శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు.


అలాగే ధరణి పోర్టల్ ప్రారంభం అయ్యేలోపే అన్ని రకాల ఆస్తుల వివరాలను పోర్టల్ లో పొందుపరచాలని సీఎం అధికారులను ఆదేశించారు. ధరణి పోర్టల్ ప్రారంభం అయిన రోజు అంటే దసరా రోజు నుండే రిజిస్ట్రేషన్లు ప్రారంభం   అవుతాయని, ఈలోగా ఎలాంటి రిజిస్ట్రేషన్లు, రెవెన్యూకి సంబందించిన వ్యవహారాలు జరగబోవని సీఎం కేసిఆర్ తెలిపారు.

No comments:

Post a Comment