Sunday 24 January 2021

గూగుల్ పే ని వెనక్కి నెట్టిన ఫోన్ పే…

 





ఈ డిజిటల్ యుగంలో అంతా స్మార్ట్ ఫోన్ లో, మన వేళ్ళ మీద కోట్లాది రూపాయలు ఒకరి నుండి మరొకరికి బదిలీ అవుతున్నాయి. ఇప్పుడు అంతా డిజిటల్ మనీ… జేబులో నోట్లు పెట్టుకొని తిరిగే పరిస్థితి నుండి, మన చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్లలో లక్షలాది, కోట్లాది రూపాయలు బదిలీ చేసే స్థితిలోకి వచ్చాము. ఎందుకంటే చిన్న హోటల్ నుండి పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ వరకు, చిన్న పండ్ల దుకాణం నుండి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వరకు అందరు డిజిటల్ పేమెంట్స్ ని అంగీకరిస్తున్నారు. వాళ్ళు కూడా వారి చేల్లిపులను డిజిటల్ రూపంలో క్షణాల్లో చేసేస్తున్నారు. అందుకే ఇండియాలో యూపీఐ  లావాదేవీలను అందిచే థర్డ్ పార్టీ యాప్స్ (టీ పీ ఏ ) ఎక్కువగా వస్తున్నాయి.


అందులో భాగంగా ఎన్ పీ సీ ఐ తాజాగా డిసెంబర్ గణాంకాలను వెల్లడించింది. ఈ గణాంకాలలో వాల్మార్ట్ సంస్థకు చెందిన ఫోన్ పే ని జనాలు ఎక్కువగా వినియోగించినట్టు ఎన్ పీ సీ ఐ ప్రకటించింది. దీనితో గూగుల్ డిజిటల్ ప్లాట్ ఫాం గూగుల్ పే రెండవ స్థానం లో ఉంది.


ఈ నివేదికల ప్రకారం డిసెంబర్ నెలలో మొత్తం లావాదేవీల సంఖ్య 902.03 మిలియన్లు, వాటి విలువ రూ. 1,82,126.88 కోట్లు.  గూగుల్ పే మొత్తం లావాదేవీల సంఖ్య 854.49 మిలియన్లు, వాటి విలువ రూ. 1,76,199.33 కోట్లు. డిసెంబర్ నెలలో జరిగిన మొత్తం లావాదేవీల్లో దాదాపు 78% వరకు ఫోన్ పే మరియు గూగుల్ పే వాటాను సొంతం చేసుకున్నాయి.


పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ మూడో స్థానం, అమెజాన్‌ పే, ఎన్‌పీసీఐకు చెందిన బీహెచ్‌ఐఎం ఆ తర్వాతి స్థానాల్లో నమోదయ్యాయి.


వాట్సాప్ 8 లక్షల లావాదేవీలతో రూ. 29.72 కోట్లుగా ఉన్నది.

ప్రస్తుతం మన దేశంలో 207 బ్యాంకులు యూపీఐ సేవలను అందిస్తున్నట్లు ఎన్‌పీసీఐ తెలిపింది.

No comments:

Post a Comment