మొన్నామద్య చిరంజీవి ఒక
సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో పొరపాటున తన ఆచార్య సినిమా టైటిల్ ని ప్రకటించి
నాలుక కరుచుకున్నాడు. ఆచార్య టీం టైటిల్ ని గ్రాండ్ గా అనౌన్స్ చేయడానికి
సన్నాహాలు చేస్తే మెగాస్టార్ దానిపై నీళ్ళు చల్లారని అప్పట్లో టాక్ వచ్చింది.
అయితే ఇది ప్రచారంలో భాగమే అని మరి కొందరు చెప్పుకొచ్చారు.
అయితే ఇప్పుడు మాత్రం మెగాస్టార్ కావాలనే ఆచార్య సినిమా కి
సంబంధించిన ఒక సీక్రెట్ ని బయటపెట్టారని తెలుస్తోంది. ఆచార్య చిత్రం కోసం ఒక ఆలయ గాలిగోపురం
సెట్ వేసారు. అయితే ఆ సెట్ చూసాక మీ అందరితో పంచుకోకుండా
ఉండలేకపోతున్నానని మెగాస్టార్ చెబుతున్నారు.
అందులో భాగంగా మెగాస్టార్
చిరంజీవి తన ట్విట్టర్ ద్వారా ఈ ఆలయ గాలిగోపురం సెట్ కి సంబంధించిన కొన్ని ఫొటోస్ ని అందరితో
పంచుకున్నారు. భారత దేశంలోనే ఇదే అతి పెద్ద టెంపుల్ టౌన్ అని పరిశ్రమ వర్గాలు
చెబుతున్నాయి. దీనితో ఆచార్య సినిమా పై అంచనాలను
మరింత పెంచిందని చెప్పొచ్చు. ఈ సెట్ ని చూసి రామ్ చరణ్ కూడా ఫిదా అయ్యాడని
సమాచారం.
ఈ ఆలయ గాలిగోపురం వేసిన
సెట్ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ కళాక్రుతులను చూస్తె నిజంగా మనం టెంపుల్ టౌన్ లో ఉన్నామా అని
అనిపుస్తుంది. ఈ సెట్ వేసిన కళా దర్శకుడు సురేష్ ని దర్శకుడు కొరటాల శివని,
నిర్మాతలు నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ ని మనస్పూర్తిగా అభినందిస్తున్నానని చిరంజీవి
చెప్పారు.
No comments:
Post a Comment