Tuesday, 5 January 2021

వైఎస్సార్సీపీ పార్టీపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

 





బీజేపీ కార్యకర్తలు రోడ్డుమీదికొస్తే వైఎస్సార్సీపీ మూట ముల్లె సర్దుకోవాల్సిందేనని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఘాటుగా హెచ్చరించారు . ఏపీలో హిందు ధర్మం పై అధికార పార్టీ దుర్మార్గాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తామమన్నారు . దేవుళ్ళ విగ్రహాలను దుర్మార్గంగా ధ్వంసం చేస్తున్నారన్నారు . ఇక్కడ అధికార పార్టీ ఒక మతానికి వత్తాసు పలుకుతుంటే అక్కడ ఒక మతమే రాజ్యం ఏలుతుందన్నారు . ఏపీలో దమ్మున్న కార్యకర్తలు ఉన్నారని వారి సహనాన్ని పిరికి తనంగా బావించొద్దన్నారు . సోము వీర్రాజు నాయకత్వంలో ఏపీ బీజేపీ పోరాటానికి సిద్ధమవుతుందని , తెలంగాణ బీజేపీ కార్యకర్తల కంటే ఏపీ కార్యకర్తలు బలవంతులని పేర్కొన్నారు . ఒక మతానికి వత్తాసు పలికితే ఇక్కడ హిందువులు ఓటు బ్యాంకుగా మారి దుబ్బాక , జీహెచ్ఎంసీలో బుద్ది చెప్పారన్నారు . తిరుపతిలో హిందువులు కూడా ఓటు బ్యాంకుగా మారాలన్నారు .


అంతేకాదు ఏడుకొండల వాడ వెంకటరమణ అనే పార్టీ కావాలా ?. బైబిల్ చేత పట్టుకొని ప్రచారం చేసే పార్టీ కావాలా ? .. భగవద్గీత చేత పట్టుకొని వచ్చే పార్టీ కావాలా ఆలోచించాలన్నారు . తిరుపతి ఉప ఎన్నిక పలితాలు కోసం దేశం ఎదురుచూస్తుందన్నారు . రెండు రాష్ట్రాలలో అధికారంలోకి వచ్చేది బీజేపీనే అన్నారు . బిజెపి కార్యాలయంలో కామారెడ్డి నుంచి పలువురు టిఆర్ఎస్ , ఇతర పార్టీల నేతలు బిజెపిలో చేరారు . ఈ సందర్భంగా బండి మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం , వైసీపీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు . ఏపీలో ఒక మతం రాజ్యమేలుతోందని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు . బైబిల్ పార్టీ కావాలో … భగవద్గీత పార్టీ కావాలో తిరుపతి ప్రజలు తేల్చుకోవాలని పిలుపునిచ్చారు . ఏపీ హిందూ దేవాలయాలపై దాడులను ఖండించిన ఆయన .. వైసీపీ రెండు కొండలు అంటోందని .. ' ఏడు కొండలవాడా గోవిందా గోవిందా ' అనేది బీజేపీ సిద్ధాంతమన్నారు . ఏపీ దేవాదాయశాఖను పూర్తిగా ప్రక్షాళన చేయాలన్నారు . హిందువుల కానుకలను దారి మళ్ళిస్తోందని ఆరోపించారు . కార్యకర్తల సహనాన్ని చేతకాని తనంగా తీసుకోవద్దని హెచ్చరించారు . దేవాలయాల పై దాడులకు ఏపీ సీఎం జగన్ మూల్యం చెల్లించు కోవలసి వస్తుందన్నారు .


తెలంగాణ వ్యతిరేకులు సీఎంకి రైట్ హాండ్ లెఫ్ట్ హాండ్ గా మారారు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు . కేసీఆర్ ని హైద్రాబాద్ లో అడుగు పెట్టనియ్యం అన్న వాళ్ళు మంత్రులు అయ్యారు . తెలంగాణ ఉద్యమ కారులు తెరమరుగు అయ్యారు .. కేసీఆర్ లెక్క ద్రోహం చేసే పార్టీ బీజేపీ కాదు . సోము వీర్రాజు గారి నేతృత్వంలో ఉద్యమాలు చేస్తున్నారు . హిందు ధర్మం పై అధికార పార్టీ దుర్మార్గాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నారు . దేవుళ్ళ విగ్రహాలను దుర్మార్గం గా ధ్వంసం చేస్తున్నారు . ఇక్కడ అధికార పార్టీ ఒక మతానినికి వత్తాసు పలుకుతుంటే అక్కడ ఒక మతమే రాజ్యం ఎలుతోంది . ఏపీలో దమ్మున్న కార్యకర్తలు ఉన్నారు వారి సహనాన్ని పిరికి తనంగా బావించవద్దు .. మా కార్యకర్తలు రోడ్డు మిదకి వస్తే వైఎస్సార్ పార్టీ మూట ముల్లె సర్దుకోవాల్సి ఉంటుందని ఘాటుగా హెచ్చరించారు . కులాల పేరుతో , మతాల పేరుతో చీల్చే ప్రయత్నం చేస్తారు .. ధర్మరక్షకులు ఆలోచించాలి . అక్కడ కూడా మా కార్యకర్తలు యుద్ధం ప్రారంభించారు . ఆ సీఎం , ఈ సీఎంలు అడ్డదారిలో గెలవాలని చూస్తున్నారు . రెండు రాష్ట్రాలలో అధికారంలోకి వచ్చేది బీజేపీ నే అని ధీమా వ్యక్తం బండి సంజయ్ సంజయ్ చేసారు . కార్యక్రమంలో పార్టీ జాతీయనేత మురళీధర్ రావు . డికె అరుణ తదితరులు పాల్గొన్నారు .

No comments:

Post a Comment