GMR Hyderabad International Airport నుండి సింగపూర్ మరియు కొలంబొ కి డైరెక్ట్ ఫ్లైట్స్...
భారత దేశంలో అత్యంత ప్రజాదరణ మరియు ఎక్కువ మంది ప్రయాణించే విమానాశ్రయాల్లో ఒకటి హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం. ఇక్కడినుండి ప్రతీ రోజు వందల జాతీయ, అంతర్జాతీయ విమానాలు కొన్ని లక్షల మందిని తమ గమ్య స్థానాలకు చేరుస్తుంది.
హైదరాబాద్ నుండి అన్ని ముఖ్య దేశాలకు, ప్రాంతాలకు విమానాలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇప్పుడు మరొక రెండు దేశాలకు హైదెరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రం నుండి ప్రయాణం చేయడానికి అందుబాటులోకి వచ్చింది.
ఇకపై హైదరాబాద్ నుండి సింగపూర్ (Singapore) మరియు కొలంబొ (Colombo) కి డైరెక్ట్ ఫ్లైట్ లో వెళ్ళొచ్చు. ఇంతకుముందు డైరెక్ట్ ఫ్లైట్స్ అందుబాటులో లేనందున, వేరే సిటీ లకు వెళ్లి అక్కడినుండి వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు ఇండిగో (Indigo) విమానయాన్ సంస్థ రాజీవ్ గాంధి అంతర్జాతీయ విమానాశ్రయం నుండి తమ సర్వీసులను ప్రారంభించనుంది.
రేపు అక్టోబర్ 29 నుండి ఫ్లైట్ 6E -1027 RGIA నుండి ఉదయం 2.50 ప్రారంభమై సింగపూర్ లో 10:00 గంటలకు అక్కడ ల్యాండ్ అవుతుంది. (Singapore Time). అలాగే మళ్ళి తిరిగి 23:25 గంటలకు బయల్దేరి 1:30 అం కి హైదరాబాద్ చేరుకుంటుంది. దీని ద్వారా ప్రయాణికులు సింగపూర్ నుండి వేరే ప్రాంతాలకు వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే సింగపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి అనేక విమాన సంస్థలు వారి సర్వీసులను వివిధ దేశాలకు వెళ్ళడానికి విమాన సదుపాయాలు కల్పిస్తున్నాయి.
దీనితోపాటు ఇండిగో 6-E -1181 ఫ్లైట్ ని నవంబర్ 3 వ తేది నుండి హైదరాబాద్ నుండి కొలంబో వెళ్ళడానికి తన సర్వీసులను ప్రారంభించనుంది. హైదరాబాద్ నుండి 11:50 గంటలకు బయల్దేరి 14:00 గంటలకు కోలంబో చేరుకుంటుంది. తిరిగి 15:00 గంటలకు బయల్దేరి 17:00 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. దీనితో ఫ్యామిలితో హాలిడేస్ కి వేల్లలనుకొనే వారికి ఇది మంచి సదుపాయం అని చెప్పొచ్చు. ఈ మధ్యనే శ్రీ లంక (Sri Lanka) ప్రభుత్వం తమ దేశానికి వచ్చే భారతీయ పౌరులకు ఉచిత టూరిస్ట్ విసా (Free Tourist Visa) ని అందించాబోతున్నట్టు ప్రకటించింది. శ్రీ లంక లోని పర్యాటక ప్రాంతాలను వీక్షించాలనుకునే వారికి ఇది మంచి అవకాశం అని చెప్పొచ్చు. ప్రతీ సోమవారం, మంగళవారం, శుక్రవారం మరియు ఆదివారం ఈ విమాన సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
Good info...👍
ReplyDelete