Wednesday, 8 November 2023

201 పరుగులు చేసి చరిత్ర సృష్టించిన Glenn Maxwell. ప్రపంచకప్ చరిత్రలో ఆస్ట్రేలియాకి గుర్తుండిపోయే విజయాన్ని అందించిన Glenn Maxwell.

 91 పరుగులకు 7 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా (Australia)

ఒంటి చేత్తో ఆస్ట్రేలియా ని గెలిపించిన Glenn Maxwell

201 పరుగులు చేసి రికార్డు క్రియేట్ చేసిన Glenn Maxwell

గెలవాల్సిన మ్యాచ్ లో ఓడిన ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan) 




ఈ రోజు వన్డే ప్రపంచకప్ లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా (Australia) మధ్య ముంబయి లోని

 Wankhede స్టేడియం లో మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 50 ఓవర్లలో 5

 వికెట్లు కోల్పోయి 291 పరుగులు చేసింది. ఆఫ్ఘన్ బ్యాటర్ Ibrahim Zadran 129 పరుగులతో నాటౌట్

 గా నిలిచి ఆఫ్ఘనిస్తాన్ స్కోరుని 291 పరుగులకు చేర్చాడు.


అనంతరం బ్యాటింగ్ కి వచ్చిన ఆస్ట్రేలియా రెండవ ఓవర్లోనే మొదటి వికెట్ T. Head ని

 కోల్పోయింది. అలా ఆస్ట్రేలియా తక్కువ స్కోరు వ్యవధిలోనే వికెట్ లను కోల్పోయింది. 19 వ

 ఓవర్ లో ఆస్ట్రేలియా స్కోరు 91 పరుగులు. అప్పటికే ఆస్ట్రేలియా 7 వికెట్లను కోల్పోయింది. ఈ

 దశలో ఆఫ్ఘనిస్తాన్ గెలుపు ఖాయమైంది. ఎందుకంటే ఒక్క Glenn Maxwell తప్ప అంత స్కోరు చేసే

 బ్యాట్స్ మెన్ ఎవ్వరూ లేరు.


కానీ ఆఫ్ఘనిస్తాన్ ఒకటి అనుకుంటే Glenn Maxwell ఒకటి చేసాడు. అదే తన ఒంటిచేత్తో

 ఆస్ట్రేలియాని గెలిపించాడు. ఒంటి చేత్తో అనేకంటే ఒక కాలుతో గెలిపించాడని చెపితే

 బాగుంటుంది. ఎందుకంటే ఆట మధ్యలో Glenn Maxwell కుడి కాలు నరాలు పట్టేయడం తో చాలా

 ఇబ్బంది పడ్డాడు. ఒక దశలో Glenn Maxwell స్ట్రెచర్ మీద తీసుకేల్తారేమో అక్కడ పరిస్థితి చూస్తె

 అనిపిస్తుంది. కానీ ఎలాగైనా ఆస్ట్రేలియాని గెలిపించాలన్న తపనతో, ఎక్కడ ఆత్మ విశ్వాసం

 కోల్పోకుండా చివరివరకు క్రీజ్ లో ఉండి 128 బంతుల్లో 201 పరుగులు చేసి ఆస్ట్రేలియా కి

 చరిత్రలో గుర్తుండిపోయే విజయాన్ని అందిచాడని చెప్పొచ్చు. 21 ఫోర్లు 10 సిక్సర్లతో

 చెలరేగిపోయాడు. క్రికెట్ వరల్డ్ కప్ 2023 లో ఇది ఎప్పటికి గుర్తుండిపోయే మ్యాచ్ అని చెప్పొచ్చు.


అయితే ఒక రకంగా చెప్పాలంటే ఈ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ చేతులారా ఈ మ్యాచ్ ని

 చేజార్చుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే Glenn Maxwell ఎప్పుడో అవుట్ అవ్వాల్సి ఉంది. చాలా

 సునాయాసమైన క్యాచ్ లను విడిచి పెట్టడంతో, ఆ అవకాశాన్ని ఉపయోన్చుకొని Glenn Maxwell

 ఆస్ట్రేలియాకి విజయాన్ని అందించాడు. ఆ క్యాచ్ లు పట్టి ఉంటె ఆస్ట్రేలియా 150 పరుగులు

 కూడా చేసి ఉండకపోయేది.

1 comment: