![]() |
Photo: @ARwisdomwings |
ఈ మధ్య ఏకారణం చేతనైన మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చివరలో మనకు అన్నిటికన్నా ముఖ్యంగా మీరు Healthy Gut maintain చేయండి అని చెప్తున్నారు. అసలు healthy Gut అంటే ఏంటో తెలుసుకుందాం.
Healthy Gut అంటే
మన ప్రేగులను ఆరోగ్యంగా ఉంచుకోవడం.
ఇది మన జీర్ణ వ్యవస్థని శాసిస్తుంది.
ఇది మీ ప్రేగులలో ఉండే సూక్ష్మజీవుల పరిస్థితిని కూడా
తెలియజేస్తుంది.
ప్రేగు ఆరోగ్యం సరిగా లేదని మనకి తెలియజేసే కొన్ని
అంశాలు ఇప్పుడు చూద్దాం.
ఎప్పుడైతే మనకు కడుపు నొప్పి, ఉబ్బరం, తలనొప్పి, ఆయాసం,
విపరీతమైన కీళ్ళ నొప్పులు వంటి సమస్యలు ఎదురైతాయో మన ప్రేగు
ఆరోగ్యం
సరిగా లేదని అర్ధం.
దీన్ని నివారించడానికి ఏం చేయాలో చూద్దాం:
పండ్లు, కూరగాయలు, చిక్కుళ్ళు, పప్పులు, బీన్స్, గింజలు, తృణ
ధాన్యాలు, తాజా
ఆహారాలు వంటివి తీసుకోవాలి.
ప్రేగులలో మంచి బాక్టీరియా ఉండడమనేది చాలా ముఖ్యం.
ఇది సరిగ్గా లేకపోతే పిల్లల్లో మనం నులి పురుగుల
సమస్య చూస్తాం.
మంచి బాక్టీరియా ముఖ్యంగా పులిసిన పదార్దాలలో లభిస్తుంది. పెరుగు,
పన్నీర్, చీజ్ వంటి వాటిలో పుష్కలంగా లభిస్తుంది.
మీకు ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఒకసారి మంచి డాక్టర్ ని సంప్రదించి
చికిత్స తీసుకోవడం మంచిది. మన ప్రేగుల ఆరోగ్యం అనేక రోగాల బారిన
పడకుండా కాపాడుతుందని డాక్టర్లు చెబుతున్నారు.
No comments:
Post a Comment