Tuesday, 31 March 2020

మెగాస్టార్ ఆచార్య ఫస్ట్లుక్ శ్రీరామ నవమి రోజు విడుదల


మెగాస్టార్ ఆచార్య ఫస్ట్లుక్ శ్రీరామ నవమి రోజు విడుదల 


మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ఆచార్య. ఇందులో చిరంజీవి దేవాదాయ శాఖ అధికారిగా కనిపించబోతున్నాడు. ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా పెరిగాయి. ఇందులో రాం చరణ్ కీలక పాత్ర పోషిస్తుందటం విషేషం. అయితే ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని  ఉగాదికి విడుదల చేయాలనుకున్నారు, కానీ కొన్ని కారణాల వల్ల విడుదల చేయలేదు. అయితే ఇప్పుడు శ్రీరామ నవమి సందర్భంగా ఆచార్య ఫస్ట్‌లుక్‌ని విడుదల చేయనున్నారు.

ఇందులో చిరంజీవి సరసన కాజల్ హీరోయిన్‌గా నటిస్తోంది. రాం చరణ్ 20 ని.ల నిడివిగల ప్రత్యేక పాత్రలో నటించనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకి స్వర బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

No comments:

Post a Comment