Thursday 16 April 2020

సాహో ఫేం సుజీత్ దర్శకత్వంలో మెగాస్టార్?


సాహో ఫేం సుజీత్ దర్శకత్వంలో మెగాస్టార్?

 

సుజీత్, ఈ పేరు తెలియని వాళ్ళు ఉండరేమో,ఎందుకంటే బాహుబలి తర్వాత ప్రభాస్‌ని సాహో సినిమాతో హాలీవుడ్ రేంజ్‌లో బాలీవుడ్‌కి పరిచయం చేసాడు . దీనితో  సుజీత్ పేరు టాలీవుడ్ నుండి బాలీవుడ్  వరకు మారుమోగింది. 

అయితే తెలుగులో సాహో సినిమా భారీగా నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. సాహో సినిమా రిలీజ్ కాకముందు సుజీత్ తో సినిమా చేయడానికి స్టార్ హీరోలు ముందుకొచ్చారు. అయితే సాహో సినిమా ఫలితంతో  వాళ్ళతో సినిమా చేసే అవకాశాన్ని కోల్పాయడనే చెప్పొచ్చు.  

అయితే మెగాస్టార్ చిరంజీవి మలయాళంలో  సూపర్ హిట్ అయిన లూసిఫర్ సినిమాని తెలుగులో చేయనున్నారు. మలయాళంలో సూపర్ స్టార్ మోహన్‌లాల్ నటించారు.  అయితే దీనీకి చాలా మంది డైరక్టర్ల పేర్లు వినిపించాయి. అయితే ఇప్పుడు  లేటెస్ట్‌గా  సాహో ఫేం సుజీత్ పేరు వినబడుతోంది. చిరంజీవి కూడా సుజీత్‌తో వీడియో కాల్ ద్వార మాట్లాడి స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేసి, మొత్తం స్క్రిప్ట్ రెడీ చేయమన్నారట.  ప్రస్తుతం సుజీత్ ఈ పనిలోనే ఉన్నాడని తెలుస్తోంది.      

ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో  ఆచార్య సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత లూసిఫర్ రిమేక్ సినిమా చేసే అవకాశం ఉంది. 

No comments:

Post a Comment