Monday 22 June 2020

ప్రజా ప్రతినిధులనూ వదలని కరోనా....



ప్రజా ప్రతినిధులను వెంటాడుతున్న కరోనా మహమ్మారి..... కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమతరావు కి కరోనా పాజిటివ్ .....


కరోనా ఎలాంటి తారతమ్యాలు  లేకుండా విస్తరించుకుంటూ పోతోంది. పేద,ధనిక, ప్రజాప్రతినిధులు ఎవరైనా జాగ్రత్తగా లేకపోతే కరోనా ముందు తల వంచాల్సిందే. ఎందుకంటే ఇప్పడు తెలంగాణాలో కరోనా ప్రజా ప్రతినిధుల వెంట పడుతున్నట్టు కనిపిస్తోంది. ఈ మధ్యనే తెలంగాణ మంత్రుల పిఏ లకు,  వాళ్ళింట్లో పనిచేసే వాళ్ళకి కరోన పాజిటివ్ అని  తేలింది. మంత్రి హరీష్ రావు హోమ్ క్వారంటైన్ లో ఉన్నట్టు సమాచారం. జనగాం ఎమెల్యేకి పాజిటివ్ అని  తేలితే హైదరాబాద్ యశోదా హాస్పిటల్ లో చేరారు. అలాగే నిజామాబాద్  ఎమెల్యే కి కరోనా పాజిటివ్ అని తేలింది. ఇలా ప్రజా ప్రతినిధులను కరోనా వెంటాడుతోంది.
ఇప్పుడు తాజాగా తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వీహెచ్ హనుమంత్ రావు కి కరోనా  పాజిటివ్ అని  తేలింది. నిన్న ఆయన అస్వస్థతకు గురైతే అపోలో ఆసుపత్రిలో చేరారు. వైద్యులు పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీనితో ఆయన అపోలో ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు.
ఇటివలే కాంగ్రెస్ పార్టీ నేత గూడూరు నారాయణ రెడ్డి కి కరోనా పాజిటివ్ అని తేలింది. ఇప్పటివరకు ముగ్గురు టి ఆర్ ఎస్  ఎమెల్యేలు , బిజెపి మాజీ ఎమెల్యే చింతల రామచంద్రారెడ్డి కరోనా బారిన పడ్డారు.
వీహెచ్ హనుమంత రావు కి కరోనా పాజిటివ్ నిర్ధారణ అవ్వటంతో ఆయనతో ప్రైమరీ కాంటాక్ట్ లో ఉన్నవారు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. వీలైతే వారు కుడా కరోనా టెస్టులు చేయించుకుంటే మంచిది.
ఇలా పార్టీ నేతలకు,ప్రజా ప్రతినిధులకు కరోనా సోకడం కొంత ఆందోళన కరంగా మారింది. ఎందుకంటే వీరు ప్రజల మధ్య ఉండటం, పార్టీ శ్రేణులతో సమావేశాల్లో పాల్గొంటూ ఉంటారు. దీనితో వీరికి కరోనా సోకడం వల్ల, వీరిని కలిసిన, సమావేశాల్లో పాల్గొన్న వారు కొంత అప్రమత్తంగా  ఉండటం మంచిది. వారుకూడా కరోనా టెస్టులు చేయించుకుంటే ముందు జాగ్రత్తలు తీసుకున్న వారవుతారు.
మరి ప్రజలకు జాగ్రత్తలు తీసుకోమని చెప్పే నాయకులు, వారు అజాగ్రత్తగా ఉంటున్నారా అని అనిపిస్తుంది. వీరంతా కరోనా బారినుండి కోలుకోవాలని ఆశిద్దాం

No comments:

Post a Comment