Monday 22 June 2020

కల్నల్ సంతోష్ బాబు ఇంటికెళ్ళి చెక్కును అందించిన తెలంగాణ సీయం కేసిఆర్ .....


కల్నల్ సంతోష్ బాబు ఇంటికెళ్ళి చెక్కును అందించిన తెలంగాణ సీయం కేసిఆర్ .....


భారత్  - చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల్లో తెలంగాణ బిడ్డ సూర్యాపేటకి చెందిన కల్నల్ సంతోష్ బాబు వీర మరణం చెందిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణ సీయం కేసిఆర్ సంతోష్ బాబు కుటుంబానికి రూ.5 కోట్ల సాయం ప్రకటించారు. దీనికి సంబందించిన చెక్కును తనే స్వయంగా సంతోష్ బాబు ఇంటికి వెళ్లి ఇస్తానని ప్రకటించారు. అందులోభాగంగా సీయం కేసిఆర్ ఈరోజు (సోమవారం) సూర్యాపేట లోని బిక్కుమళ్ళ కల్నల్ సంతోష్ బాబు ఇంటికి వెళ్లి  సంతోష్ బాబు కుటుంబాన్ని పరామర్శించారు. మంత్రి జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ లు కూడా పాల్గొన్నారు.

సూర్యాపేట చేరుకున్న సీయం కేసిఆర్, ముందుగా కల్నల్ సంతోష్ బాబు చిత్రపటానికి నివాళి అర్పించారు. తరువాత సంతోష్ బాబు భార్య, తల్లితడ్రులు, సోదరిని పరామర్శించారు. దేశ రక్షణ కోసం సంతోష్ బాబు ప్రాణత్యాగం చేసారని, సంతోష్ బాబు మరణం తనను కలచి చేసిందని సీయం కేసిఆర్ అన్నారు. ప్రభుత్వం సంతోష్ బాబు కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటుందని, ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తనను సంప్రదించాలని కేసిఆర్ అన్నారు.అలాగే సంతోష్ బాబు కుటుంబ బాగోగులు చూసుకోవాలని మంత్రి జగదీశ్వర్ రెడ్డిని ముఖ్యమంత్రి కోరారు.

అలాగే కల్నల్ సంతోష్ బాబు భార్య సంతోషికి గ్రూప్-1 ఉద్యోగం అప్పాయింట్మెంట్ లెటర్, రూ. 4కోట్ల చెక్కును  మరియు హైదరాబాద్ లోని బంజారా హిల్స్ లో 711 గజాల స్థలానికి సంబందించిన డాకుమెంట్స్  ని మఖ్యమంత్రి స్వయంగా అందించారు. అలాగే రూ. 1 కోటి చెక్కుని సంతోష్ బాబు తల్లితండ్రులకు అందించారు.

No comments:

Post a Comment