Monday 22 June 2020

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..... ప్రభుత్వ ఆఫీసుల్లో ఈరోజు నుండి 50 శాతం ఉద్యోగులు హాజరు....


తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..... ప్రభుత్వ ఆఫీసుల్లో ఈరోజు నుండి 50 శాతం ఉద్యోగులు హాజరు....


రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతుండటంతో, తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆఫీసుల్లో 50 శాతం ఉద్యోగులే హాజరు కావాలని మార్గదర్శకాలు జారీ చేసింది. ఇది ఈరోజు నుండి అమలు కానుంది. జూన్ 22 నుండి జూలై 4 వ తేది వరకు 50 శాతం ఉద్యోగులతోనే కార్యకలాపాలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. అంటే ఒక ఉద్యోగి  ఈరోజు వస్తే, మరుసటి రోజు తన సహోద్యోగి వస్తారు. ఇలా ప్రభుత్వ ఆఫీసుల్లో 50 శాతం ఉద్యోగులు ఉండాలని నిర్ణయం తీసుకుంది.

అధికారులు,సిబ్బందికి ఏవైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే ఇంటి వద్దే ఉండాలని, ప్రతీ రోజు ఆఫీసు పరిసరాల్లో శానిటైజ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఉద్యోగులు ఏసీలు ఎంత తక్కువగా వాడితే అంత మంచిదని సూచించింది.

ప్రభుత్వ ఆఫీసుల్లో అందరు హాజరు అయితేనే పనులు నత్తనడకన నడుస్తాయి. మరి 50 శాతం తో పనులు ఇంకెంత వెనుకబడిపోతాయో. దీనివల్ల, రోజు రెగ్యులర్ గా జరిగే పనులు కుడా నెమ్మదించే అవకాశాలు ఉన్నాయి.  

No comments:

Post a Comment