Monday 22 June 2020

గుడ్ న్యూస్ : కరోనాకి మందు వచ్చిందోచ్ .....


గుడ్ న్యూస్ : కరోనాకి మందు వచ్చిందోచ్ .....


తొలిసారి దేశీయ అనుమతి పొందిన గ్లెన్మార్క్ ఫార్మాస్యుటికల్స్..... త్వరలో మార్కెట్లోకి కరోనాకి మందు.....
ప్రపంచం మొత్తం, కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అన్ని దేశాల్లో  రోజు రోజుకు మరణాల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. ఇండియాలో కుడా రోజు రోజుకూ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. కరోనా కి మందు కనిపెట్టే పనిలో ప్రపంచంలోని ఫార్మాస్యుటికల్ కంపనీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అందులో ఇండియా ముందు ఉన్నాడని చెప్పొచ్చు.

ఇండియాలోని అన్ని ఫార్మా కంపనీలు కరోనా మందు కనిపెట్టే పరిశోధనలో నిమగ్నమయ్యారు. దానిలో భాగంగా మొట్టమొదటిగా గ్లెన్మార్క్ ఫార్మాస్యుటికల్స్ కి డిసిజిఐ  (డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా) నుండి అనుమతి లభించింది. గ్లెన్మార్క్ తయారు చేసిన యాంటి వైరల్ ఔషదమైన ఫ్యావిపిరవిర్ కి  డిసిజిఐ అనుమతి మంజూరు చేసింది. ఈ ఔషదాన్ని ఫ్యాబిఫ్లూ పేరుతో మార్కెట్ లోకి తీసుకురానున్నట్లు గ్లెన్ మార్క్ సంస్థ ప్రకటించింది.
ఈ మందు,కోవిడ్-19 ఒక మాదిరి నుండి మధ్యస్థాయిలో ఉన్న రోగులు వాడితే నాల్గైదు రోజుల్లో వైరస్ ప్రభావం తగ్గి రోగి కోలుకునే అవకాశం ఎక్కువగా ఉందని గ్లెన్మార్క్ సంస్థ ప్రకటించింది. ఈ మందును తమ సొంత పరిశోధన, పరిజ్ఞానం తో తయారు చేసామని గ్లెన్మార్క్ సంస్థ ప్రకటించింది. కోవిడ్-19 ప్రస్తుతం దేశంలో చాలా వేగంగా విస్తరిస్తోంది. ఇలాంటి  పరిస్థితుల్లో ఫ్యావిపిరవిర్ మందు కొంత వరకు కేసుల పెరుగుదలను నియంత్రించే అవకాశముంది.

అయితే గేన్మార్క్ ఈ మెడిసిన్ ధర కుడా నిర్ణయించింది. వైద్యుల ప్రిస్క్రిప్షన్ ఉన్నవారికి ఒక్కో టాబ్లెట్ రూ. 103కు విక్రయిస్తారు.

తొలిరోజు 1800 ఎంజీ డోసు రెండుసార్లు  ఆ తర్వాత రెండు వారాలపాటు 800 ఎంజీ డోసు చొప్పున వాడాలని కంపనీ వారు సిఫార్సు చేసినట్టు  తెలుస్తోంది.

No comments:

Post a Comment