Friday 19 June 2020

నిహారిక కొణిదెల ఇప్పుడు మిస్ కాదు... మిసెస్...


నిహారిక కొణిదెల ఇప్పుడు మిస్ కాదు... మిసెస్...


నిన్నటి నుండి సోషల్ మీడియాలో ఈ  విషయం బాగా వైరల్ అయ్యింది. అదే నిహారిక Instagram లో పెట్టిన పిక్. తను పోస్ట్ చేసిన పిక్ లో మొదట స్టార్ బక్స్ కాఫీ కప్ పై మిస్ నిహ అని రాసి ఆ తర్వాత మిస్ కొట్టేసి మిసెస్ అనే పదాన్ని రాసి క్వశ్చన్ మార్క్ పెట్టింది. తరువాత  పీక్ ఎ బూ అంటూ తానూ ఒక అబ్బాయిని హత్తుకొని ఉన్న ఫోటోను షేర్ చేసింది. అతని మొహం కనిపించకుండా దాచేసింది.

ఈ రెండు ఫొటోలు  ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మొన్న నాగబాబు ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు నిజమయ్యాయని చెప్పొచ్చు. నాగబాబు మాట్లాడుతూ త్వరలో నిహారిక పెళ్లి గురుంచి విశేషాలు చెబుతాం అన్నారు. దాని తరువాత కొన్ని రోజులకే నిహారిక తన Instagram లో  ఫొటోలు పెట్టడంతో దానికి బలం చేకూరింది. అలాగే నెటిజన్లకు ఆమె పెళ్లి వార్తలపై ఆసక్తి పెరిగింది.

మొత్తానికి నిహారిక పెళ్లి ఫిక్స్ అయినాట్టు తెలుస్తోంది. మెగా కాంపౌండ్ లో పెళ్లి భాజాలు మోగబోతున్నాయని తెలుస్తోంది. నిహారిక పోస్ట్ చేసిన ఫోటో లో ఉన్నది ఓ పోలీసు ఉన్నతాధికారి కుమారుడిగా తెలుస్తోంది.
అయితే చాలా రోజులనుండి నిహారిక విషయంలో చాలా రూమర్స్ వచ్చాయి. నాగ శౌర్య, నిహారిక డేటింగ్ చేస్తున్నారని, త్వరలో పెళ్ళని రూమర్స్ వచ్చాయి. అంతకుముందు వరసకు బావ అయిన  సాయి ధరమ్ తేజ్ పేరు కూడా లిస్టు లో  ఉండేది. కొన్ని నెలల క్రితం ప్రభాస్ పేరును కూడా ఇందులోకి లాగారు ఈ రూమర్స్ సృష్టి కర్తలు.

చివరిగా అవ్వన్నీ రూమర్స్ ని పక్కకి పెట్టి, సినిమా కుటుంబానికి సంభందం లేని వ్యక్తిని పెల్లదబోతున్నట్టు తెలుస్తోంది.

పూర్తి విషయాలకోసం మెగా కాంపౌండ్ నుండి వచ్చే ప్రకటన కోసం వేచి చూడాల్సిందే.

No comments:

Post a Comment