Monday 29 June 2020

హైదరాబాద్ లో మళ్ళీ లాక్ డౌన్ ?


హైదరాబాద్ లో మళ్ళీ లాక్ డౌన్ ?


తెలంగాణలో కరోనా విజ్రుభింస్తోంది. రోజురోజుకూ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. టెస్టులను ఎప్పటికంటే ఎక్కువగా చేయడంతో దానికి తగ్గట్టే కరోనా పాజిటివ్ కేసులు కూడా పెరుగుతున్నాయి. దీనిలో ఎక్కువ భాగం జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయి. మొత్తం కేసుల్లో దాదాపుగా 70 నుండి 80 శాతం కేసులు జీహెచ్ఎంసీ, హైదరాబాద్ పరిసర ప్రాంతాలైన మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో నమోదవుతుండటంతో అటు ప్రభుత్వం ఇటు ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని, తెలంగాణ ఆరోగ్య శాఖ హైదరాబాద్ లో 15 రోజుల పాటు లాక్ డౌన్ విధించాలని  ప్రభుత్వానికి సూచన చేసింది. దీనికి  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. కానీ లాక్ డౌన్ చేయాలంటే అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని, అందరిని మరోసారి సమాయత్తం చేయాలని ఆయన అన్నారు. అందుకోసం, లాక్ డౌన్ విధిస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, సడలింపులు,ఇతరత్రా విషయాల గురించి  మూడు, నాలుగు రోజుల్లో నివేదిక అందించాలని అధికారులను కోరారు. దాని ఆధారంగా సంబంధిత అధికారులతో, మంత్రులతో చర్చించి నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. 

గతం కంటే ఈ లాక్ డౌన్ కఠినంగా  అమలు చేసే అవకాశముంది. ఎందుకంటే ఎవ్వరూ నిభంధనలను పాటించకపోవడం కొంత ఇబ్బందికరమైన విషయం. అసలు  కరోనా వైరస్ లేదు అన్నట్లు జనాలు రోడ్లపై తిరగడంతో,సోషల్ డిస్టెన్స్ పాటించకపోవడం వలన ఈ కరోనా వైరస్ బాగా వ్యాప్తి చెందింది. ఈ స్థాయిలో కేసులు పెరిగిన తరువాత లాక్ డౌన్ ఎంతవరకు కేసులు పెరగకుండా ఉండడానికి ఉపయోగపడుతుందో తెలియదు.
లాక్ డౌన్ విధించిన సమయంలో  హైదరాబాద్ మొత్తం వీలైనన్ని టెస్టులు చేయగలిగితే కొంతవరకు కొత్త కేసుల వ్యాప్తి తగ్గే అవకాశముంది. టెస్టులు చేయకపోతే వైరస్  ఉన్నవ్యక్తికి ఆ విషయం తెలియక ఎదో ఒక సందర్భంలో ఎవరినైనా కలిసే అవకాశం ఉంది.  దాని వల్ల వైరస్  వ్యాప్తి చెందే  అవకాశం ఎక్కువగా ఉంటుంది.

మరోవైపు గత కొన్ని రోజులనుండి శాంపిల్స్ సేకరణను కూడా ప్రభుత్వం ఆపేసింది. టెస్టు రిపోర్ట్స్  ఎక్కువగా పెండింగ్ ఉండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతోంది.

అటు ప్రైవేట్ లాబ్స్ పైన కూడా ప్రభుత్వం కన్నెర్ర చేసింది. సరైన నిబంధనలను పాటించడం లేదంటూ కమిటీ రిపోర్టు ఇచ్చినట్టు ప్రభుత్వం చెబుతోంది. దీనితో ప్రైవేట్ లాబ్స్ లో కూడా కరోనా టెస్టులను ఆపేశారు. దీనితో ఎవరైనా అనుమానంతో కరోనా టెస్టు చేయించుకోవాలంటే ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేట్ లాబ్స్ కూడా టెస్టులు ఆపేసామని, చెప్పి వెనక్కి పంపిస్తున్నట్టు  సమాచారం.

No comments:

Post a Comment