Thursday 2 July 2020

ఇండియన్ టిక్ టాక్ గా చింగారి యాప్...


ఇండియన్ టిక్ టాక్ గా  చింగారి యాప్...



ప్రస్తుతం ఇండియాలో ప్రతీ ఇద్దరి మద్య జరిగే సంభాషణ టిక్ టాక్ ను ఇండియాలో నిలిపివేయడం గురించే. ఎందుకంటే ఇండియాలో ప్రతీ ఒక్కరి  స్మార్ట్ ఫోన్లో  టిక్ టాక్ యాప్ ఉండకుండా ఉండదు. అలాంటింది  భారత ప్రభుత్వం 59 చైనా యాప్ లను బ్యాన్ చేసింది. దీనికి కారణం వ్యక్తిగత డేటా, భద్రతా కారణాల దృష్ట్యా టిక్ టాక్ తో పాటు మొత్తం 59 చైనా యాప్ లను బ్యాన్ చేసింది. దానితో దీనిపై ఆధారపడ్డ వారికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రభావం ఉండే అవకాశం ఉంది.

అయితే దీనికి ధీటుగా మేడ్ ఇన్ ఇండియా యాప్  చింగారి – Original Indian Short Video App  పేరుతో మార్కెట్లోకి వచ్చింది. నిజానికి ఈ యాప్ చైనా వస్తువులను బ్యాన్ అనే నినాదానం సమయంలోనే వచ్చింది. అంతకుముందు మిట్రాన్ యాప్ టిక్ టాక్ కి పోటిగా వచ్చినప్పటికీ ఎక్కువ రోజులు నిలువలేక పోయింది. డౌన్ లోడ్లతో దూసుకుపోతున్న ఆ యాప్ గూగుల్ ప్లే స్టోర్ నుండి తొలగించడం జరిగింది.

దాని తర్వాత వచ్చిన ఇండియా యాప్ చింగారి. ఈ యాప్ లో  ఇతర వ్యక్తులతో చాట్ చేసుకోవచ్చు. వీడియోలను అప్లోడ్ చేసుకోవచ్చు. యూజర్లు స్వంతంగా తమ వాట్సాప్ స్టేటస్, వీడియోలు,  ఆడియోలను రూపొందించుకోవచ్చు.

ఇందులో ముఖ్య విషయం ఏంటంటే, ఎవరి వీడియోలైతే ఎక్కువ వైరల్ అవుతాయో, వారికి పాయింట్లు ఇస్తారు. ఆ పాయింట్లను డబ్బులుగా మార్చుకునే అవకాశం ఉంది. చింగారి యాప్ ఇంగ్లిష్‌, హిందీ, తెలుగు, మ‌రాఠి, బంగ్లా, పంజాబీ, క‌న్న‌డ‌, తమిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో అందుబాటులో ఉంది.

1 comment:

  1. add one like button after post. bro you need one 3d logo. I am create @ just 500/- only. Interest plase send whats msg 9949818282

    ReplyDelete