Image Source: Twitter / @KChiruTweets
ఆచార్య సినిమా షూటింగ్ కోసం COVID test చేయించుకున్న మెగాస్టార్
తాను COVID test చేయించుకుంటే రిజల్ట్ పాజిటివ్ వచ్చిందని మెగాస్టార్
చిరంజీవి ప్రకటించారు. ట్విట్టర్ వేదికగా చిరంజీవి ఈ విషయాన్ని తెలియజేసారు.
ఆచార్య షూటింగ్ ప్రారంభించే ముందు తాను COVID test చేయించుకున్నానని, రిజల్ట్ పాజిటివ్
వచ్చిందని తెలిపారు. గత నాలుగైదు రోజుల క్రితం నుండి నన్ను కలిసిన వాళ్ళందరిని
COVID test చేయించుకోవాల్సిందిగా కోరుతున్నానని ఆయన తెలియజేసారు.
అయితే రెండు రోజుల క్రితమే చిరంజీవి, నాగార్జున తెలంగాణ సీయం కేసీర్ ని కలిసి సినిమా
ఇండస్ట్రీ కి సంభందించిన భూమి కేటాయింపు, అలాగే వరద భాదితుల సహాయానికి అందిచాల్సిన
చెక్ ని అందిచడం జరిగింది. చిరంజీవి తో కలిసి నాగార్జున కూడా పాల్గొనడంతో నాగార్జున
ఫ్యామిలీ ఒక్కసారి అలర్ట్ అయినట్టు తెలుస్తోంది.
దీనితో పాటు మరోసారి ఆచార్య సినిమా షూటింగ్ వాయిదా పడే
అవకాశముంది. చిరంజీవి లేకుండానే ఆచార్య షూటింగ్ స్టార్ట్ అయినట్టు సమాచారం. అయితే
చిరంజీవి కూడా షూటింగ్ లో పాల్గోనేముందు COVID test చేయించుకోవడం జరిగింది.
రిజల్ట్ పాజిటివ్ రావడంతో చిరంజీవి తన షూటింగ్ ని మరికొంత కాలం వాయిదా వేసే అవకాశం ఉంది.
ప్రస్తుతం చిరంజీవి హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. తనకు
ఎలాంటి కరోనా లక్షణాలు లేవని, ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తానని
ఆయన చెప్పారు.
No comments:
Post a Comment