Tuesday, 10 November 2020

సంచలనం సృష్టించిన ఇస్రో... ISRO made history in 2020.

 





భూ పరిశీలక ఇఒఎస్- 01 ఉపగ్రహాన్ని శనివారం నాడు భారత్ విజయవంతంగా ప్రయోగించింది . దీనితోపాటు లిథువేనియా ( 1 ) , లర్జెంబర్గ్ ( 4 ) , అమెరికా ( 4 ) దేశాలకు చెందిన మరో తొమ్మిది ఉపగ్రహాలను కూడా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు . శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం వేదికగా ఈ ప్రయోగం జరిగింది. కోవిడ్- 19 మహమ్మారి ప్రబలిన సమయంలో భారత్ కు ఈ ఏడాది ఇదే మొదటి ప్రయోగం . ఇస్రో నమ్మినబంటు పిఎన్ఎ సి 49 రాకెట్ ద్వారా ఈ ఉపగ్రహాలు కక్ష్యలోకి చేరుకున్నాయి.


 

మొదటగా వ్యవసాయం, అడవులు , విపత్తు నిర్వహణలో మద్దతుగా ఉండే భూ పరిశీలక ఉపగ్రహం ఇఒఎస్ -01 ని కక్ష్యలోకి ప్రవేశ పెట్టారు. ఆ తర్వాత మిగిలినవాటిని ఒకదాని వెనక ఒకటిగా నిర్దేశిత కక్ష్యలలోకి చేర్చారు. కోవిడ్ లాక్ డౌన్ కారణంగా ఇస్రో చేపట్టాల్సిన 10 ప్రయోగాలు వాయిదాపడ్డాయి.


అసాధారణమైన విజయం : ఇస్రో అధ్యక్షుడు శివన్ ఈ ప్రయోగం విజయవంతమైంది అని పేర్కొన్నారు. అయితే ఇది అసాధారణం అన్నా రు. ఎందుకంటే రాకెట్ ప్రయోగించాలంటే ' వర్క్ ఫ్రమ్ హోమ్ ' కుదరదని , అందరు ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు వివిధ కేంద్రాల నుంచి కలిసి పనిచేయడానికి శ్రీహరికోటకు రావాల్సి ఉంటుందని శివన్ అన్నారు.  భూ పరిశీలక ఉపగ్రహం ఇఒఎస్- 01 తో పాటు మరో తొమ్మిది ఉపగ్రహాలను పిఎస్వి-సి 49 కచ్చితంగా 575 కిలోమీటర్ల కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టిందని శివన్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రయోగించిన తర్వాత ఇఒఎస్ కు సంబంధిం చిన సోలార్ ప్యానెళ్లు తెరుచుకోవడం లాంటి పనులు మొదలయ్యాయని అన్నారు .

 

ఈ పని సవ్యంగా సాగేందుకు తగిన చర్యలు తీసుకున్నందుకు గాను వివిధ కేంద్రాలకు చెందిన ఇస్రో డైరెక్టర్లకు, సిబ్బందికి, వారి కుటుంబాలకు శివన్ అభినందనలు తెలిపారు. దీపావళికి ముందే ఇస్రో రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించిందని శివన్ అన్నారు.  ప్రయోగానికి 44.5 మీటర్ల పిస్ఎల్వీ- 49 రాకెట్ ను ఉపయోగిం చారు . ఇస్రోకు ఇది 51 వ పీఎస్ఎల్వీ ప్రయోగం . 26 గంటల కౌంట్ డౌన్ తర్వాత నాలుగు దశల రాకెట్‌లో మొదటిదశను 3.12 నిమిషాలకు మండించారు . దాంతో పిస్ఎల్వీ సి 49 నిప్పులు చిమ్ముకుంటూ నింగికి ఎగసింది. నిజానికి ప్రయోగం 3.02 నిమిషాలకు జరగాలి .

 

 

రాకెట్ ప్రయాణించే మార్గంలో అంతరిక్ష వ్యర్థాలు అడ్డు రావడం, వాతావరణం బాగా లేకపోవడంతో 15 నిమిషాల ముందు ప్రయోగాన్ని కొంతసేపు నిలిపివేయాలని నిర్ణయించారు. అలా పది నిమిషాల ఆలస్యం తర్వాత భారీ వర్షం మధ్యలో నారింజ రంగు నిప్పులను చిమ్ముకుంటూ పిఎస్ఎల్వీసి 49 దట్టమైన మేఘాలలోకి వెళ్లిపో యింది. దీనికోసం పిస్ఎల్వీ - డిఎల్ రకానికి చెందిన రెండు స్ట్రాప్ ఆన్ బూస్టర్లు ఉన్న రాకెట్ ను ఉపయోగించారు . ఈ రకం రాకెట్ ను గతంలో 2019 జనవరి 24 న మైక్రోశాట్ ఆరు (పిస్ఎల్వీ సి 44 ద్వారా ) ప్రయో గించేందుకు ఉపయోగించారు . ఈ తరహా రాకెట్ తో ఇది రెండో ప్రయోగం.


No comments:

Post a Comment