ఇటీవల కాలంలో పెరుగుతున్న మిస్సింగ్ , కిడ్నాపింగ్ కేసుల దృష్ట్యా శుక్రవారం సైబరాబాద్ కమీషనరేట్‌లో విలేకరుల
సమావేశంలో మాట్లాడుతూ మిస్సింగ్ కేసులు
వ్యవస్థీకృత నేరాలు కావు , అవి కేవలం వ్యక్తిగత
కేసులు మాత్రమేనని , సైబరాబాద్ సిపి విసి
సజ్జనార్ అన్నారు. మిస్సింగ్ కేసులను నివారించడానికి పోలీసులు ప్రత్యేక చర్యలు
తీసుకుంటున్నారని , ప్రజలు భయాందోళన
చెందవద్దని అభయమిచ్చారు .
మిస్సింగ్ కేసులకు సంబంధించి కుటుంబ సభ్యులు , మిస్సింగ్ అయిన వ్యక్తులు , పిల్లల తాలూక
బంధువులెవరైనా సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టయితే వారికి తగిన న్యాయం
చేస్తామని సిపి చెప్పారు.
అదృశ్యం వెనుక కారణాలు.. ఇటీవల కాలంలో మిస్సింగ్
కేసుల వార్త లను తరచుగా వింటున్నాం . తెలిసి తెలియని వయసులో చిన్నారులు ఇంటి నుంచి
తప్పిపోవడం , ప్రేమ పేరుతో టీనేజర్లు , వివాహేతర సంబంధాలు , కుటుంబ కలహాలు, అప్పులు, ఆత్మహత్య చేసుకోవటం, ఇతరత్రా కారణాల నేపథ్యంలో అదృశ్యమవుతున్నారు . అదేవిధంగా పరీక్ష ఫలితాల
వెల్లడి సమయంలోను ఎక్కువగా విద్యార్థుల మిస్సింగ్ కేసులు నమోదవుతుంటాయని ఆయన
పేర్కొన్నారు . ఇలాంటి సందర్భాలలో వెళ్లిన పిల్లల్లో ఒక రిద్దరు మినహా మిగతా
వారంతా ఇండ్లకు తిరిగి వచ్చే స్తుంటారన్నారు . పరీక్షల సమయంలో లవ్ ఎఫైర్స్ ఉన్న
కొంత మంది యువత సైతం ఇంటి గడప దాటుతున్నా రని తెలిపారు .
వీటితోపాటు తల్లిదండ్రులతో తరచూ
తగువులాడినా పిల్లలు , ఇంటినుంచి వెళ్లిపోయే
అవకాశాలు ఎక్కువగా ఉంటాయని , మరి కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల మీద అలిగి
వెళ్లిపోతుంటారన్నారు. పరీక్షల్లో మార్కులు రాలేదనే కారణంతో చిన్నారులు
మాయమవుతుంటే .. ఆర్థిక ఇబ్బందులతో మధ్య వయస్కులు ఇళ్ల నుంచి వెళ్లిపోతున్నారు .
అమ్మాయిల విషయానికిస్తే మోసగాళ్ల
ప్రేమలో పడి పారిపోవటం , ఇష్టంలేని పెళ్లి , కుటుంబంలో ప్రతికూల వాతావరణం వంటి పలు కారణాలు అధికంగా కనిపిస్తున్నాయని
తెలిపారు. అదేవిధంగా మహిళల విషయాని కొస్తే అత్తింట్లో సరైన ఆదరణ లేకపోవడం , హింసను భరించలేక వెళ్లిపోతున్నారని తెలిపారు . మరికొందరు వివాహేతర సంబంధాలు , కుటుంబ కలహాలు , అప్పుల బాధతో ఆత్మహత్య
చేసుకోవటం, ఇతరత్రా కారణాల నేపథ్యంలో అదృశ్యమవుతున్నారు
. వృద్ధుల విషయం లోకి వస్తే అదృశ్యానికి పిల్లలు తమను సరిగా చూడటం లేదనేదే ప్రధాన
కారణంగా కనిపిస్తోందని , కొంతమంది మతిస్థిమితం
సరిగా లేకపోవడం వల్ల అదృశ్యం అవుతున్నారని చెప్పారు . విద్యార్థుల విషయంలో చదువు
పట్ల భయం , తప్పుచేసి పెద్దల భయానికి పారిపోవటం , చెడు స్నేహం, దురలవాట్ల కారణంగా ఇటీవలి కాలంలో
అదృశ్యమవుతున్న కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని స్పష్టం చేశారు. సోషల్ మీడియా
కారణంగా అబ్బాయిలు , అమ్మాయిల మధ్య ఆకర్షణ
పెరిగిందని, వీటి ద్వారా అదుపు లేకుండా మాట్లాడుకోవడం, ఇంటి నుంచి పారిపోయేందుకు
ప్రేరేపించే అంశంగా మారుతోంది అని సీపీ అన్నారు. ఎవరూ బయపడ వద్దని ఆయన అన్నారు.
No comments:
Post a Comment