Wednesday 25 November 2020

RRR Movie Updates: RRR సినిమా కోసం రాజమౌళి మాస్టర్ ప్లాన్

 

Image Source: Google



బాహుబలి సీరిస్ తరువాత ఎస్ ఎస్ రాజమౌళి తీస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం RRR.  రాజమౌళి తో పాటు టాలీవుడ్ టాప్ హీరోలు, బాలీవుడ్, హాలీవుడ్ సేలేబ్రీటీలతో పాన్ ఇండియా సినిమా గా తెరకెక్కుతున్న ఈ సినిమా పై  రోజు రోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. అయితే ఎప్పటికప్పుడు రాజమౌళి ఈ సినిమాపై అంచనాలను పెంచడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. అందుకోసం రాజమౌళి ఒక మాస్టర్ ప్లాన్ వేశాడని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.


మన తెలుగు సినిమాలో ఈ మధ్య ఒక హీరోకి మరో హీరో పరిచయ సమయంలో వాయిస్ ఓవర్ ఇవ్వడం చాలా మామూలైపోయింది. అలాగే RRR సినిమా కోసం రామ్ చరణ్ కోసం ఎన్టీఆర్ , ఎన్టీఆర్ కోసం చరణ్ వాయిస్ ఓవర్ ఇచ్చుకున్నారు. సైరా సినిమా కోసం చిరంజీవికి ఏకంగా పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ఇవ్వడం జరిగింది.


అయితే పాన్ ఇండియా సినిమా గా RRR తెరకెక్కుతుండటంతో, అదే స్థాయిలో రాజమౌళి ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. అదేంటంటే కొమరం భీం, అల్లూరి సీతారామ రాజు లను పరిచయం చేయడానికి మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఇవ్వనున్నారని సమాచారం. దీనికి చిరంజీవి కూడా ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. అలాగే హిందీలో కొమరం భీం, అల్లూరి సీతారామ రాజు లను పరిచయం చేయడానికి అమీర్ ఖాన్ వాయిస్ ఇవ్వనున్నారని సమాచారం.


RRR సినిమా వివిధ ప్రాంతీయ భాషల్లో విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆయా భాషల్లో స్టార్స్/సేలేబ్రిటీలతో  జూ.ఎన్టీఆర్ , రామ్ చరణ్ కి వాయిస్ ఓవర్ ఇచ్చే విధంగా పక్కాగా ప్లాన్ చేస్తున్నారట రాజమౌళి. ఇదే కనుక నిజమైతే RRR సినిమాకి మరింత క్రేజ్ పెరిగే అవకాశం ఉంది.  


కాగా ప్రస్తుతం RRR సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ సినిమాని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. మ్యూజిక్ ఎప్పటిలాగే యం.యం, కీరవాణి అందిస్తున్నారు.


No comments:

Post a Comment