Friday, 27 November 2020

GHMC Elections: రోజు రోజుకు వేడెక్కుతున్న జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం... జోరు పెంచుతున్న కమల నాథులు...

 

GHMC elections, Image source: Wikipedia 




గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల వేడి డిల్లీ వరకు చేరింది. కమల నాథులు గ్రేటర్ హైదరాబాద్ లో తమ సత్తా చాటుకునేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తోంది. దానికి తగ్గ ప్రణాళికలతో ముందుకు వెళ్తోంది.


దుబ్బాకలో విజయం తరువాత బిజేపి లో కొంత ఆత్మ స్తైర్యం పెరిగిందని చెప్పొచ్చు. ఆ ఉత్సాహంతో బిజేపి అభ్యర్తులు గ్రేటర్ ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నారు. మరోవైపు టీఆర్ఎస్ ఒక్క ఓటమితో నిరాశ చెందవద్దని గ్రేటర్ లో గెలుపు మనదే అని అభ్యర్తులను బరిలోకి దించుతోంది.


గ్రేటర్ ఎన్నికలు ముఖ్యంగా టీఆర్ఎస్,బిజేపి మద్య జరుగుతున్నట్టుగా అనిపిస్తోంది.  రెండు పార్టీలు ప్రచారంలో జోరును పెంచాయి. టీఆర్ఎస్ తరుపున గ్రేటర్ భాద్యతను కేటీఆర్ తీసుకున్నట్టు తెలుస్తోంది. అటువైపు బిజేపి మాత్రం ఎటువంటి అవకాశం వదులుకోవద్దని, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడానికి కేంద్రం నుండి జాతీయ స్థాయి నేతలను ఈ గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి రప్పించడం జరుగుతోంది.


మానిఫెస్టో విడుదల కోసం మహారాష్ట్ర  మాజీ  ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్  రానున్నారు. ఈ నెల 27 వ తేదిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి రానున్నారు.  ఈ నెల 28 వ తేదిన బిజేపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రోడ్ షో లో పాల్గొననున్నారు. అలాగే ఈ నెల 29 వ తేదిన కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచార రోడ్ షో లో పాల్గొననున్నారు.


మొత్తానికి బిజేపి టీఆర్ఎస్ కి గ్రేటర్ ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధమైందని చెప్పొచ్చు. ఈ ఎన్నికల్లో మంచి ఫలితాలను రాబట్టి, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపి రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధం చేయాలని చూస్తోంది.


No comments:

Post a Comment