రాజకీయాలనుండి తిరిగి సినిమాల్లోకి వచ్చాక, మెగాస్టార్
చిరంజీవి పూర్తిగా సినిమాల మీద దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. తమిళ సినిమా
రీమేక్ తో మెగాస్టార్ సినిమాల్ల్లోకి రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తరువాత
సైరా అనుకున్నంతగా ప్రజల్లోకి వెళ్ళకపోవడంతో కొంత ఆలోచన పడి, పక్కాగా సక్సెస్
ఇచ్చే కొరటాల శివ తో ఆచార్య సినిమాని ఫైనల్ చేసారు, కొంత షూటింగ్ పూర్తవగానే కరోనాతో అన్నీ తారు
మారయ్యాయి. ప్రస్తుతం ఆచార్య సినిమా షూటింగ్ మొదలు కానుంది.
అయితే ఇప్పుడున్న పరిస్టితుల్లో కొత్త కథలు దొరకడం, అలాగే
మెగాస్టార్ ని మెప్పించడం అంత సులభమైన విషయం కాదు. అలాగే చిరంజీవి కూడా కథల
విషయంలో తొందరగా నిర్ణయం తీసుకోలేకపోతున్నాడు. దీనితో ఇతర భాషలో విడుదలై విజయాన్ని
అందుకున్న కథలను రీమేక్ చేయడమే మంచిదని చిరంజీవి భావిస్తున్నట్టు తీలుస్తోంది.
అందుకే ఆచార్య సినిమా తరువాత, వరుసబెట్టి రెండు రీమేక్ లను చేయనున్నాడు. అందులో ఒకటి అజిత్ వేదాళం, మరొకటి మలయాళం సినిమా
లూసిఫర్.
అయితే అజిత్ వేదాళం సినిమాకి తెలుగులో డైరెక్టర్ గా మెహెర్
రమేష్ ని చిరంజీవి ఒకే చేసారు. ఇప్పడు సమస్య అంతా లూసిఫర్ రీమేక్ చేసే డైరెక్టర్
గురించే. ఎందుకంటే ఈ సినిమాకోసం మొదట సాహో ఫేం సుజిత్ ని ప్రకటించేశారు. పాపం
సుజిత్ స్క్రిప్ట్ వర్క్ మొత్తం చేసాక,
చిరు కొంచెం మార్పులు చేర్పులు చేయమన్నాడు, కానీ చిరంజీవిని
మెప్పించలేకపోవడంతో సుజిత్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు. తరువాత తనకు
రీఎంట్రీ లో కూడా సక్సెస్ ని ఇచ్చిన వి.వి.వినాయక్ పేరు బయటకొచ్చింది. వి.వి.వినాయక్
కూడా స్క్రిప్ట్ వర్క్ తో మెగాస్టార్ ని మెప్పించాలేకపోయాడు. దీంతో ఈ ప్రాజెక్ట్
గబ్బర్ సింగ్ ఫేం హరీష్ శంకర్ దగ్గరికి వెళ్ళింది. అయితే హరీష్ శంకర్ పవర్ స్టార్
పవన్ కళ్యాణ్ తో కమిట్ అవడంతో,ఈ ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించడం జరిగింది.
దీనితో ఈ చాన్స్ తమిళ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళింది. తని
ఒరువన్ సినిమాతో తెలుగు వారికి చేరువయ్యాడు మోహన్ రాజా. ఎందుకంటే అదే సినిమాని మెగా పవర్ స్టార్ రామ్
చరణ్ ధ్రువ సినిమా గా రీమేక్ చేసి సక్సెస్ అందుకున్నాడు. ఇంతకు ముందు హనుమాన్
జంక్షన్ సినిమాతో తెలుగు వారికి సుపరిచుతుడే. మోహన్ రాజ మొదట రిమేక్ సినిమాలను
తీసి సూపర్ హిట్స్ అందించాడు. తెలుగులో సూపర్ హిట్ సాధించిన సినిమాలను తమిళ్ లో
రిమేక్ చేసి సక్సెస్ అందించాడు. తన తమ్ముడు రవిని తెలుగులో విజయం సాధించిన జయం
సినిమాతో హీరో గా తమిళ ఇండస్ట్రీకి పరిచయం చేసాడు.
మోహన్ రాజా రిమేక్ లతో విజయాల బాట పట్టించగలడని పేరుంది.
కాబట్టి, చిరంజీవి లూసిఫర్ రిమేక్ కోసం మోహన్ రాజా తో పని చేయడానికి సుముఖతతో
ఉన్నట్టు తెలుస్తోంది.
ఒకవేళ మెగాస్టార్ తో లూసిఫర్ సినిమా చేసి విజయాన్ని
అందుకుంటే మోహన్ రాజా కి తెలుగులో పెద్ద హీరోలతో చేసే అవకాశాలు సులభమవుతాయి. ఎందుకంటే
మోహన్ రాజా తెలుగు లో చివరగా చేసిన సినిమా హనుమాన్ జంక్షన్. ఈ సినిమా 2001 లో
విడుదలైంది. అంటే 19 సంవత్సరాల తరువాత మోహన్ రాజా తెలుగులో సినిమా
తీయబోతున్నదన్నమాట. ఇదంతా అనుకున్నది అనుకున్నట్టు జరిగితే తప్ప ఇది సాధ్యం కాదు.
ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో చివరి క్షణంలో ఎలాంటి మార్పులైనా జరుగవచ్చు. కాబట్టి
సినిమా షూటింగ్ మొదలయ్యే వరకు వేచి చూడడం మంచిదేమో.
ఇంకొక విషయం ఏటంటే, డైరెక్టర్ మోహన్ రాజా , జయం రవి ఇద్దరూ
ఎడిటర్ మోహన్ కొడుకులు.
No comments:
Post a Comment