Sunday, 3 January 2021

కేసిఆర్ పతనం మొదలైంది -ఉత్తమ్ కుమార్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

 

సీఎం కేసీఆర్ పతనం మొదలైందని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్ కుమార్‌రెడ్డి , భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. కేసీఆర్‌ను చూసుకుని పోలీసులు ఎగిరిపడా దని , ఎక్స్ ట్రాలు చేసే వారెవరినీ వదిలి పెట్టబోమని హెచ్చరించారు . జనగామ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్య క్షుడు జంగా రాఘవరెడ్డిని పోలీసులు జైలుకు పంపడంపై వరంగల్ సెంట్రల్ జైలు వద్ద నిరసన తెలిపేందుకు వెళ్తూ శనివారం భువనగిరి బైపాస్ వద్ద వారు మాట్లాడారు. అనంతరం ఎమ్మెల్యే సీతక్క , మాజీ ఎమ్మెల్సీ కొండా మురళితో కలిసి జైలులో ములాఖత్ ద్వారా రాఘవరెడ్డిని పరామర్శించిన తరువాత మాట్లా డారు. అధికార పార్టీ నేతలు, మంత్రి ఎర్రబెల్లి ఒత్తిడి తోనే రాఘవరెడ్డిపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పం పారని ఉత్తమ్ అన్నారు. టీఆర్ఎస్ నాయకులు బందిపోటు దొంగల్లా ప్రవర్తిస్తున్నారని, వారికి పోలీసులు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతూ , అక్రమ కేసులు బనాయిస్తోందన్నారు. పోలీసులు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. కాగా, కేసీఆర్ కు పోయే రోజులు దగ్గర పడ్డాయని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని, రెండేళ్లలో కాంగ్రెస్ అధికా రంలోకి వస్తుందని చెప్పారు. కాగా , కాంగ్రెస్ నేతల రాక సందర్భంగా కార్యకర్తలు ర్యాలీగా వరంగల్ సెంట్రల్ జైలు వద్దకు చేరుకుని రాఘవరెడ్డి అరెస్టును నిరసిస్తూ ధర్నా చేశారు. దీంతో గంటకు పైగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించింది. అంతకు ముందు ఉత్తమ్ బైక్ ర్యాలీని మడికొండ వద్ద పోలసులు అడ్డుకోవడంతో ఆయన కారులో నగరానికి చేరు కున్నారు. జైలులో రాఘవరెడ్డితో ములాఖత్ అనంతరం ఉత్తమ్ బృందం పోలీసు కమిషనరేట్ కార్యాలయానికి వెళ్లారు. ఇన్ చార్జి సీపీ ప్రమోద కుమారు కలిసి రాఘవరెడ్డి అక్రమ అరెస్టుపై విచారణ జరిపించాలని కోరారు .


రాఘవరెడ్డి అరెస్టుకు కారణం ఇదీ …


కాజీపేట ప్రశాంత్ నగర్‌కు చెందిన తంగళ్లపల్లి సమ్మయ్యను రాఘవరెడ్డి తన గెహోను పిలిపించుకొని డబ్బులు ఇవ్వాలని బెదిరించి , దాడి చేశారనే అభియోగంపై 2020 నవంబరు 1 న ఐపీసీ 321 , 447 , 352 , 365 , 427 , 506 సెక్షన్ల కింద ఆయనపై కేసు నమో దైంది . అప్పటి నుంచి పరారీలో ఉన్న రాఘవరెడ్డిని గురువారం పోలీసులు అరెస్టు చేసి శుక్రవారం రిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా .. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతోపాటు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కారణంతో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై రఘునాధపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. హైదరాబాద్ నుంచి వెళ్తున్న క్రమంలో కోమళ్ల టోల్‌గేట్ వద్ద నర్మెట్ట సీఐ సంతోష్ కుమార్ ఆయనను అడ్డుకున్నారు. దీంతో కోమటిరెడ్డి తన కారు దిగి వచ్చి సీఐపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వాహనాలను టోల్‌గేట్ దాటించుకొని వెళ్లిపోయారు. ఈ విషయంపై సీఐ సంతోష్ కుమార్ ఫిర్యాదు చేశారు .

No comments:

Post a Comment