Tuesday 24 October 2023

Anirudh Ravichander upcoming 6 movies- Details are here

 



అనిరుద్ రవిచందర్ రాబోయే సినిమాల వివరాలు....

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో ఇప్పుడు ఒక పేరు మారు మ్రోగుతోంది. అదే అనిరుద్ రవిచందర్ (Anirudh Ravichander) . ఈ పేరు ఇప్పుడు సౌత్, నార్త్ అని కాకుండా సినిమా పాట గురించి మాట్లాడుకుంటే అందులో అనిరుద్ పేరు ప్రస్తావనకు రాకుండా ఉండదు. ఎందుకంటే ఈ మధ్య అనిరుద్ అందించే మ్యూజిక్ కి బాలీవుడ్ స్టార్స్ కూడా ఫిదా అయిపోతున్నారు. ముఖ్యంగా అనిరుద్ తమిళ సినిమాలలో మాస్ పాటలకు ఎక్కువగా పాపులర్ అని చెప్పొచ్చు. ధనుష్ కొలవేరి తో వెలుగులోకి వచ్చిన అనిరుద్ ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్స్ కూడా అనిరుద్ మ్యూజిక్ డైరక్టర్ గా కావాలంటున్నారు.


తాజాగా వచ్చిన జైలర్ (Jailer), జవాన్ (Jawan) సినిమాలతో మరింత బిజీగా తయారయ్యాడు. ముఖ్యంగా అనిరుద్ అందిచే పాటలు అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వడం లో అనిరుద్ తో పోటీ పడటం కొంచెం కష్టం అని చెప్పొచ్చు. హీరోలకి కావాల్సిన హైప్ ని తీసుకొచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వడం లో అనిరుద్ దిట్ట అని చెప్పొచ్చు. అందుకు ఉదాహరణ జైలర్ సినిమా. తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ప్రేక్షకులను కట్టి పడేసాడని చెప్పొచ్చు. అప్పుడు కావాలా లాంటి పాటలతో మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తాడు.


జవాన్ తో బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అనిరుద్ మంచి విజయాన్ని అందుకున్నాడు. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ (Sharukh Khan) అనిరుద్ మ్యూజిక్ కి ఫిదా అయ్యాడు. జవాన్ విజయంలో అనిరుద్ మ్యూజిక్ కూడా దోహద పడిందని చెప్పొచ్చు.


ప్రస్తుతం లియో (Leo) సినిమా తో మరోసారి తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడని చెప్పొచ్చు.


ప్రస్తుతం అనిరుద్ చేతిలో 6 సినిమాలు ఉన్నాయి. అవన్నీ స్టార్ హీరోల సినిమాలే. అందులో జూ.ఎన్టిఆర్( Jr. NTR), కొరటాల శివ (Koratala Shiva) కాంబినేషన్ లో వస్తున్న దేవర (Devara) సినిమా కి మ్యూజిక్ అందిస్తున్నాడు. అనిరుద్ మాస్ బీట్స్ కి జూ. ఎన్టిఆర్ స్టెప్స్ ఎలా ఉంటాయో అని ఫ్యాన్స్ తో పాటు సగటు ప్రేక్షకుడు ఎదురు చూస్తున్నాడు. దేవర సినిమా ఏప్రిల్ 5, 2024 న విడుదలకి సన్నాహాలు జరుగుతున్నాయి.


వీటితో పాటు సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) తలైవార్ 170 మరియు తలైవార్ 171 సినిమాలు, అజిత్ (Ajith)తో ఒక సినిమా, విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), గౌతమ్ తిన్ననూరి సినిమాకి అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. 2024 సంవత్సరం లో కూడా అనిరుద్ తన మ్యూజిక్ తో ప్రేక్షకులను అలరించి నంబర్ వన్ మ్యూజిక్ డైరక్టర్ గా కొనసాగించే అవకాశం ఉంది. ప్రస్తుతం అనిరుద్ కోసం రూ. 10 కోట్లు ఇవ్వడానికి కూడా నిర్మాతలు వెనుకడుగు వేయట్లేదని ఇండస్ట్రీ లో టాక్ వినిపిస్తోంది.

No comments:

Post a Comment