వన్డే క్రికెట్ చరిత్రలో ఇలా అవుట్ అవ్వటం మొదటి సారి అని చెప్పొచ్చు. ఈ విచిత్రమైన
సంఘటన క్రికెట్ ప్రపంచ కప్ లో భాగంగా బంగ్లాదేశ్, శ్రీ లంక మధ్య జరిగిన మ్యాచ్ లో
చోటుచేసుకుంది.
ICC ODI World Cup 2023 లో భాగంగా ఈ రోజు బంగ్లాదేశ్, శ్రీ లంక మధ్య మ్యాచ్ జరుగుతోంది.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. శ్రీ లంక మొదట్లో త్వర త్వర గా వికెట్లు పడ్డప్పటికీ స్కోరును
పెంచుకుంటూ పోయింది.అయితే ఇక్కడే క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు చూడని సంఘటన
చూడటం జరిగింది. ఇక్కడ బౌలర్ బాల్ వేయకుండానే శ్రీ లంక తమ వికెట్ ని కోల్పోవడం జరిగింది.
25 వ ఓవర్లో శ్రీ లంక క్రికెటర్ సమరవిక్రమ అవుట్ అవ్వడం జరిగింది. అయితే తరువాత శ్రీ లంక
మాజీ కెప్టెన్ Mathews క్రీజు లోకి రావాల్సిఉంది. ICC World Cup 2023 నిబంధనల ప్రకారం 2 ని.ల
లోపు కొత్త బ్యాట్స్ మెన్ క్రీజులోకి రావాలి. కానీ Mathews స్టేడియం లో వచ్చాక తన హెల్మెట్
చూసుకుంటే ఆ హెల్మెట్ కి ఉండే బెల్ట్ తెగిపోయి ఉంది. పెవిలియన్ లో ఉన్న ఆటగాడితో
హెల్మెట్ తెప్పిచ్చు కోవడం జరిగింది. కానీ ఆ హెల్మెట్ తేవడానికి చాలా సమయం తీసుకోవడం
జరిగింది. అప్పటికే Mathews క్రీజులోకి రాకుండా దాదాపు 3 ని.లు అయిపొయింది. దీనితో
బంగ్లాదేశ్ కెప్టెన్ షాకిబ్ అల్ హసన్ అంపైర్లకు ఫిర్యాదు చేయడం జరిగింది.
వాస్తవానికి క్రికెట్ నిబంధనల ప్రకారం చూస్తె దీనిని అవుట్ గా పరిగణించవచ్చు. కానీ కెప్టెన్ /
ఎంపైర్ దాని నుండి మినహాయింపుగా ఆటగాడిని ఆడటానికి అవకాశం ఇస్తారు. కానీ ఇక్కడ
Mathews ఎంతగా వివరించినా బంగ్లాదేశ్ కెప్టైన్ ససేమిరా అనటంతో చివరగా బంగ్లాదేశ్ కెప్టైన్
Shakib Al Hasan నిర్ణయానికే వదిలేశారు. దీనితో Shakib టైం అవుట్ గా నిర్ణయించడంతో Mathews
నిరాశ చెందుతూ పెవిలియన్ బాట పట్టాడు. పెవిలియన్ లోకి వెళ్ళగానే Mathews అసహనం తో
తన హెల్మెట్ ని నేలకు విసిరి కొట్టడం జరిగింది.
ఈ రకంగా పెవిలియన్ దారి పెట్టిన ఆటగాడిగా చరిత్రలో శ్రీ లంక మాజీ కెప్టైన్ Mathews నిచాడని
చెప్పొచ్చు.
మొదట బ్యాటింగ్ చేసిన శ్రీ లంక 49.3 ఓవర్లలో 279 పరుగులకు ఆలౌట్ అయ్యింది. శ్రీ లంక
బ్యాటర్ అసలంక 6 ఫోర్లు 5 సిక్సులతో సెంచరి పూర్తి చేసి శ్రీ లంక కి మంచి స్కోరుని
అందించాడు.
No comments:
Post a Comment