Thursday 2 November 2023

Happy Birthday King Khan Sharukh Khan- #HBDSRK58- SRK "DUNKI" teaser out. #DunkiDrop1. DUNKI teaser Review.

 


షారుఖ్ ఖాన్ (Sharukh Khan) 58 వ పుట్టిన రోజు సందర్భంగా DUNKI సినిమా టీజర్ (DROP1) విడుదల


ఈ రోజు షారుఖ్ ఖాన్ (Sharukh Khan) తన 58 వ పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు. షారుఖ్ ఖాన్

 (Sharukh Khan)పుట్టిన రోజు సందర్భంగా వచ్చే నెలలో విడుదల కాబోతున్న DUNKI సినిమా

 టిజర్ (DROP 1) ని విడుదల చేసారు. ఒక అంతర్జాతీయ మిడియకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో

 DUNKI సినిమా టైటిల్ గురించి షారుఖ్ ఖాన్ వివరించారు. పంజాబ్ లో DONKEY ని DUNKI గా

 పలుకుతారు. దాన్నే మేము ఇంగ్లీష్ లో DUNKI అని పెట్టామని చెప్పారు.


ఈ DUNKI సినిమా ఐదుగురి కథ గా చెప్పొచ్చు. వీళ్ళకు లండన్ (London) వెళ్ళాలని కోరిక.

 ఎలాగైనా లండన్ వెళ్లి తీరాలని ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఇంట్లో వాళ్ళు వాళ్ళ ప్రయత్నానికి

 అడ్డుపడుతున్నట్టు తెలుస్తోంది. అయతే ఈ ఐదుగురు ఎలాంటి ప్రయత్నాలు చేసారు, ఇంతకీ ఆ

 ఐదుగురు లండన్ వెళ్ళారా లేదా, లండన్ వెళితే అక్కడ ఎలాంటి పరిస్థితులను వాళ్ళు

 ఎదురుకోవాల్సి వచ్చిందనేది ఈ టిజర్ ద్వారా తెలుస్తోంది. కానీ రెండవ టీజర్ (DROP2) విడుదల

 అయితే గాని మనకు మరికొంచం వివరాలు తెలిసే అవకాశం ఉంది.



మీరు పైన ఉన్న టిజర్ ని గమనిస్తే అది పాస్ పోర్ట్ కాపీ అని తెలుస్తోంది. అంటే వీళ్ళు

 చాలా  సార్లు లండన్ వెళ్ళడానికి ప్రయత్నించి వీసా రెజెక్ట్ అవుతూ వస్తుంది. అందుకే

 టైటిల్ లో మీరు  గమనిస్తే DUNKI DROP 1 అని దర్శకుడు తెలివిగా టిజర్ లో చెప్పాడు.

 తరువాత DROP 2 అని  విడుదల చేస్తున్నారు.


మున్నా భాయ్ MBBS, 3 ఇడియట్స్. పీకే సినిమాల దర్శకుడు రాజ్ కుమార్ హిరాణి 

(Raj Kumar Hirani) ఈ సినిమాకి  దర్శకత్వం వహిస్తున్నాడు. రాజ్ కుమార్ హిరాణి సినిమాలు

 ఎక్కువ భాగం సమాజానికి సందేశం  ఇచ్చేవిగా ఉంటాయి. మరి DUNKI సినిమాలో ఏ విషయం

 గురించి చెప్పబోతున్నాడని సినీ  అభిమానులు ఎదురు చూస్తునారు.


 ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ తో పాటు తాప్సి పన్ను (Tapsee Pannu), విక్కి కౌశల్ (Vicky Koushal), బోమన్ ఇరాని (Boman Irani) నటించారు. 

ఈ సంవత్సరం షారుఖ్ ఖాన్ తన మూడవ సినిమాని విడుదల చేయబోతున్నాడు. పఠాన్ మరియు

 జవాన్ సినిమాలు బాలీవుడ్ కి ఊపిరిని అందించాయని చెప్పొచ్చు. ఈ రెండు సినిమాలు 1000

 కోట్ల క్లబ్ లో చేరాయి. ఈ సంవత్సరం DUNKI కూడా విడుదల అవుతోంది. ఈ సినిమా కూడా 1000

 కోట్ల క్లబ్ లో చేరితే షారుఖ్ సరికొత్త రికార్డును క్రియేట్ చేసినవాడవుతాడు.

DUNKI సినిమా ఈ సంవత్సరం క్రిస్టమస్ (Christmas) సందర్భంగా విడుదల కాబోతోంది.


మరి మీరు కూడా ఒకసారి DUNKI DROP 1 ని చూసి ఎంజాయ్ చేయండి. 




No comments:

Post a Comment