టమాటా లో లైకోపిన్ అనే యాంటి యాక్సిడెంట్స్ ను కలిగి
ఉంటుంది. ఎండకు చర్మం పాడు కాకుండా చూస్తుంది.చాలా నీరు కలిగి ఉంటుంది.
మునగకాయ లో విటమిన్ C, కాల్షియం, ఐరన్ సమృద్దిగా ఉండి ఎండకు డీలా పడకుండా చేస్తుంది.
క్యారెట్, బీట్రూట్ లో బీటా కెరాటిన్లు
ఉంటాయి. ఇవి కళ్ళను,జుట్టుని ఎండ
నుండి వచ్చే అతినీలలోహిత కిరణాల నుండి కాపాడతాయి.
ఆకు కూరలు శరీరానికి చాలా చలువ చేస్తుంది. కంటి చూపు దెబ్బ
తినకుండా చూస్తుంది. ఆకుకూరలు ఎక్కువగా తింటే ఎండాకాలంలో కొంతమందిలో వాంతులు, విరోచనాలు అవుతాయి. కాబట్టి తక్కువ మోతాదులో తీసుకోవాలి.
దోసకాయ లో చాలా నీరు ఉంటుంది. రుచిగానూ ఉంటుంది. చిన్నపిల్లలకు కూడా చాలా నచ్చుతుంది.
కీర దోసకాయ, ఇది కూడా దోసకాయ రకమే. ఇందులో కూడానీరు పుష్కలంగా ఉంటుంది. ఎండాకాలంలో డీ హైడ్రేషన్ బారిన పడకుండా చేస్తుంది.
No comments:
Post a Comment