Monday 8 June 2020

తెలంగాణలో 10th క్లాస్ పరీక్షలు రద్దు.... అందరూ పాస్ ....


తెలంగాణలో 10th  క్లాస్ పరీక్షలు రద్దు.... అందరూ పాస్ ....


కరోనా వల్ల ఎప్పుడో జరగాల్సిన పరిక్షలను వాయిదా వేస్తూ వస్తున్నారు. ఇప్పడు దేశంతో పాటు రాష్ట్రంలో కూడా కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొన్ని ఈరోజు సీయం కేసిఆర్ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. చాలా రోజుల నుండి ఈ విషయమై అన్ని వర్గాల వారి అభిప్రాయాలను తీసుకోవడం జరిగింది.

వాటి ఆధారంగా, విద్యార్థులను , వారి  భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని, ఇప్పుడున్న పరిస్టితుల్లో వారికి పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది తేల్చలేక పోవడంతో, 10th  క్లాస్ పరీక్షలు రద్దు చేస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం  ప్రకటించింది.


ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ లో వచ్చిన మార్కుల ఆధారంగా విద్యార్థులకు గ్రేడ్ ని నిర్ణయిస్తారు. ఇందులో అటు స్టూడెంట్స్ ఇటు పేరెంట్స్ కి దీనిపై ఇంకా చాలా సందేహాలు ఉన్నాయి. రాష్ట్ర విద్యాశాఖ త్వరలో గ్రేడింగ్ విధానం గురించి  పూర్తి  వివరాలని వెల్లడించే అవకాశం ఉంది.

అయితే ఈ విధానంలో, ఒకవేళ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ ని సీరియస్ గా  తీసుకొని విద్యార్థులకు ఇబ్బంది కలిగే  అవకాశం ఉంది. ఈ విధానం వల్ల    విద్యార్థుల మెరిట్ విధానం కొంత వరకు మారే అవకాశం ఉంది. అయితే వారికిచ్చే గ్రేడ్ల  కంటే పిల్లలు క్షేమంగా ఉండడమే ముఖ్యమని ఎక్కువ శాతం తల్లిదండ్రులు భావిస్తున్నారు. అదికూడా నిజమే,ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా నిబందనలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహించడం అంటే ప్రభుత్వానికి తలకుమించిన భారమే అని చెప్పొచ్చు. ఇవ్వన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం 10th  క్లాస్ పరిక్షలు రద్దు చేస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం  ప్రకటించింది.

అయితే ప్రభుత్వం నిర్ణయంపై అన్ని రకాల ఉపాధ్యాయ సంఘాలు  హర్షం వ్యక్తం చేశాయి.

No comments:

Post a Comment