Saturday 6 June 2020

రిలయన్స్ జియోలో మరో సంస్థ పెట్టుబడి.



రిలయన్స్ జియోలో  మరో సంస్థ పెట్టుబడి.


రిలయన్స్ జియో వరుసగా, తమ సంస్థలోకి పెట్టుబడిదారులను ఆహ్వానిస్తోంది. మొన్న ఫేస్ బుక్ మరియు అమెరికా సంస్థలు జియోలో భారీగా పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే. ఈసారి అబుదాబికి చెందిన  ముబాదల ఇన్వెస్ట్ మెంట్ కంపనీ, జియోలో పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చింది. 

ఈ కంపెనీ రూ. 9093కోట్లు పెట్టుబడి పెట్టడం జరిగింది.  ఈ విషయం నిన్న జియో సంస్థ ప్రకటించింది. దీనితో ముబాదల  జియోలో  1.85 శాతం వాటాని పొందింది. ఈ పెట్టుబడితో  జియోలో పెట్టుబడుల విలువ మొత్తం రూ. 87, 655 .35 కోట్లకు చేరుకుంది. జియోలో  6 వారాల్లో 6 సంస్థలతో పెట్టుబడుల ఒప్పదం జరగడం విశేషం.

దీని గురించి ముఖేష్ అంబానీ మాట్లాడుతూ, జియో ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు చేరువ అవ్వడానికి, వృద్ధి చెందడానికి ముబాదల అనుభవం ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము అని  అన్నారు.

No comments:

Post a Comment