Wednesday 17 June 2020

మరోసారి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించనున్నారా..... రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి .... ప్రధాని నిర్ణయం పై ప్రజల్లో చర్చ ....


మరోసారి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించనున్నారా..... రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి .... ప్రధాని నిర్ణయం పై ప్రజల్లో  చర్చ ....

ఈరోజు రేపు అన్ని రాష్ట్రాల  ముఖ్యమంత్రులతో భేటి ....
ప్రధాని మోడీ లాక్ డౌన్ పై కీలక ప్రకటన చేసే అవకాశం....

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా మెట్రోపాలిటన్ నగరాల్లో దీని  ప్రభావం ఎక్కువగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత కట్టడి చేసినా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. మహారాష్ట్ర, డిల్లీ లాంటి రాష్ట్రాల్లో కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో కుడా కరోనా తీవ్రత పెరుగుతూ ఉంది. దాంతో తమిళనాడు ప్రభుత్వం ఈనెల 19వ తేదీ నుండి నెల చివరి వరకు మరల పూర్తి లాక్ డౌన్ ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా కేసుల తీవ్రత ఎక్కువగానే ఉంది.

ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ముఖ్యమంత్రులతో ఈరోజు, రేపు సమావేశం కానున్నారు. లాక్ డౌన్ పొడగించానున్నారని ప్రచారం జరుగుతున్న కారణంగా, ఈ సమావేశాలకు ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశాల తరువాత మోడీ కీలక ప్రకటన చేయనున్నారని, దేశవ్యాప్తంగా మరోసారి లాక్ డౌన్ అమలు చేస్తారని ప్రచారం జరుగుతోంది.

దేశ ఆర్ధిక వ్యవస్థ దెబ్బతినకుండా, కరోనాని అరికట్టే చర్యల గురించి ఆయా రాష్ట్రాల అభిప్రాయాలను సేకరించడానికి ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్టు పీఎంఓ వర్గాలు వెల్లడించాయి.

ఇప్పుడున్న పరిస్తితుల్లో లాక్ డౌన్ తప్పనిసరని, లేకపోతే కేసులు ఇంకా పెరిగే అవకాశం ఉందని కొందరి అభిప్రాయం.

మరి మోడీ సర్కారు ఎలాంటి నిర్ణయం తిసుకోబోతోందో తెలియాలంటే ముఖ్యమంత్రులతో సమావేశాలు పూర్తయ్యే వరకు వేచి చూడాల్సిందే.

No comments:

Post a Comment