Thursday 18 June 2020

ఇండియా-చైనా ఘర్షణ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం.....


ఇండియా-చైనా ఘర్షణ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం.....


ఇండియా చైనా బోర్డర్ లో రెండు దేశాల మధ్య జరిగిన పోట్లాటలో 20 మంది భారతసైనికులు మరణించిన సంగతి తెలిసిందే. మరణాల  సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. అవకాశం కోసం ఎదురు చూస్తున్న చైనా సైన్యం అనూహ్యంగా 16 వ బీహార్ రెజిమెంట్ దళానికి చెందిన సైనికులపై  దాడి చేసింది. ఇనుపరాడ్లు, కర్రలతో దాడి చేసి 20 మందిప్రాణాలను బలిగొన్నారు. అదేస్థాయిలో ఇండియన్ ఆర్మీ కూడా ప్రతిఘటించడంతో 35 నుండి 43మంది వరకు చైనా సైనికులు మరణించి ఉండొచ్చని సమాచారం.

అయితే ఈ విషయమై భారత ప్రభుత్వం కుడా సీరియస్ గా  తీసుకుందని సమాచారం. దీనితో రక్షణ శాఖా మంత్రి సైనికాధికారులతో చర్చలు జరిపారు. భారత సైన్యం చేసిన త్యాగం వ్రుధాకాదని అన్నారు. ఈవిషయమై ప్రధానితో చర్చించడం జరిగింది. ఈ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. బోర్డర్ లో స్థానిక ఆర్మీ కమాండర్లకు పరిస్థితులకు అనుగుణంగా స్వయంగా నిర్ణయాలు తీసుకునే అధికారం ఇచ్చింది. అంతేకాకుండా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుకుర్కునేందుకు సిద్దంగా ఉండాలని ఆర్మీ,నావీ , ఎయిర్ ఫోర్స్ దళాల అధికారులకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

No comments:

Post a Comment