Thursday 18 June 2020

జియోలో పెట్టుబడుల వెల్లువ


జియోలో పెట్టుబడుల  వెల్లువ


ఒకవైపు కరోనా వ్యాప్తితో ప్రపంచవ్యాప్తంగా బడా కంపనీలు ఆర్ధికంగా కుదేలు అవుతున్నాయి. ఇటువంటి సమయంలో  జియో ప్లాట్ ఫాం విలువ రోజురోజుకు  పెరుగుతూ  పోతోంది. అందులో భాగంగానే ప్రపంచ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ జియో ప్లాట్ ఫాం లో పెట్టుబడి పెట్టడం ప్రారంభించింది. అప్పటినుండి జియో ప్లాట్ ఫాం లోకి పెట్టుబడుల వర్షం కురుస్తోంది. ప్రపంచంలోని వివిధ రంగాల దిగ్గజ కంపనీలు జియో ప్లాట్ ఫాం లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయి.

జియోలో పేస్ బుక్, సిల్వర్ కేక్, జనరల్ అట్లాంటిక్, విస్టా ఈక్విటి, ముబాదల, కేకేఆర్ వంటి దిగ్గజ కంపనీలు పెట్టుబడులు పెట్టాయి. ఇప్పుడు తాజాగా, వరల్డ్ క్లాస్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ టిపిజీ కూడా రూ. 4546.8 కోట్ల పెట్టుబడితో ముందుకు వచ్చింది. ఈ పెట్టుబడితో జియోలో టిపిజీ వాటా 0 .93 శాతం దక్కనుంది.
టిపిజీ పెట్టుబడి తరువాత జియో ప్లాట్ ఫాం మొత్తం విలువ 102432.15 కోట్లకు చేరుకుంది.
ఇప్పటివరకు జియో ప్లాట్ ఫాం పెట్టుబడులు ఈ విధంగా ఉన్నాయి.

No comments:

Post a Comment