Friday 19 June 2020

గూగుల్ డ్యుయో గ్రూప్ వీడియో కాలింగ్...... ఒకేసారి 32 మంది మాట్లాడుకోవొచ్చు.


గూగుల్ డ్యుయో గ్రూప్  వీడియో కాలింగ్...... ఒకేసారి 32 మంది మాట్లాడుకోవొచ్చు.


లాక్ డౌన్ కారణంగా అందరు ఇంటి నుండి పనులు చేస్తుండటంతో ఇంటర్నెట్ వినియోగం దాంతో పాటు వీడియో కాన్ఫరెన్సు యాప్ లకు మంచి డిమాండ్ వచ్చిందనే చెప్పాలి. అటు కార్పోరేట్  స్కూల్స్ కూడా విద్యార్థులకు వీడియో కాన్ఫరెన్స్ ల ద్వారా ఆన్లైన్ క్లాసెస్ కానిచ్చేస్తున్నాయి. దీనితో కాన్ఫరెన్స్ వీడియో కాలింగ్ కి ప్రాధాన్యం పెరిగింది.

దీనితో అన్ని బడా సంస్థలు వాళ్ళయాప్ లను అప్డేట్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా గూగుల్ డ్యుయో వీడియో కాలింగ్ సదుపాయాలను అప్డేట్ చేసింది. ఇంతకు ముందు గూగుల్ డ్యుయోలో ఒకేసారి 12 మంది వరకు మాత్రమే  పాల్గొనడానికి అవకాశం ఉండేది. దాన్ని ఇప్పుడు 32 మంది ఒకేసారి వీడియో కాలింగ్ ద్వారా కన్నెక్ట్ అయ్యే విధంగా గూగుల్ డ్యుయో మార్పులు చేసింది.

 దీనికోసం గూగుల్ క్రోమ్ కొత్త  వెర్షన్ ని ఉపయోగించాలని గూగుల్ సంస్థ ప్రకటించింది.  ఈ మార్పుల తరువాత గూగుల్ డ్యుయో మరియు ఆపిల్ ఫేస్ టైం సమానమయ్యాయి.

గూగుల్ సరికొత్త టెక్నాలజీని వాడి ఈ మార్పు చేసింది. అతితక్కువ బ్యాండ్విడ్త్ కనెక్షన్ లో కుడా ఇది పనిచేసేలా తయారు చేయబడింది. వీడియో కాలింగ్ చేస్తున్న సమయంలో ఫోటో తీసుకునే సదుపాయాన్ని కూడా ఇందులో కల్పించడం జరిగింది.

No comments:

Post a Comment