Thursday 18 June 2020

తెలంగాణలో విజ్రుంభిస్తున్న కరోనా వైరస్.....


తెలంగాణలో విజ్రుంభిస్తున్న కరోనా వైరస్.....



రోజు రోజుకు తెలంగాణలో కేసులు భారీగా నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో తెలంగాణలో 269 కేసులు నమోదయ్యాయి. బుధవారం రాత్రి కరోనా పరిస్థితిపై రాష్ట్ర ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో 1096 శాంపిల్స్ టెస్ట్ చేయగా, 269 మందికి పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. దీనితో తెలంగాణలో ఇప్పటివరకు 45,911 టెస్టులు చేయగా, 5,675 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపారు.

బుధవారం ఒకరు కరోనాతో మరణించగా, 151 మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో మొత్తం ఇప్పటివరకు డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 3071 కి చేరింది. అలాగే మృతుల సంఖ్య 192 కి చేరుకుంది.
ప్రస్తుతం 2412 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా, గత 24 గంటల్లో నమోదైన మొత్తం కరోనా కేసుల్లో 214 మంది ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉండడం కొంత కలవరపెట్టే విధంగా ఉంది.

మొదటినుండి జీహెచ్ఎంసీ పరిధిలోనే ఎక్కువ కేసులు నమోదవుతూ వస్తున్నాయి. దానికి తగ్గటు ప్రభుత్వం కేసులు ఉన్నచోట వరకు కంటోన్మెంట్ జోన్లుగా నిర్ణయించింది. ఎక్కువ ప్రభుత్వ కార్యాలయాలు, కంపెనీలు జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉండడంతో, లాక్ డౌన్ సడలింపులతో అందరు ఎప్పటిలాగే బయటికి రావడం జరుగుతోంది. సామాజిక దూరం, మాస్కులు తప్పని సరి అని ప్రభుత్వం హెచ్చరిస్తున్నప్పటికీ దాన్ని ఎంతమంది పాటిస్తున్నారనేది సమస్యగా మారింది. దీనివల్ల కుడా జీహెచ్ఎంసీ పరిధిలో కేసులు ఎక్కువగా పెరగడానికి కారణమవుతోంది.

ఇది ఇలా కొనసాగితే మరి ప్రభుత్వం జీహెచ్ఎంసీ పరిధిలో ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అని ప్రజలు చర్చించుకుంటున్నారు.   

No comments:

Post a Comment