Thursday 18 June 2020

ఖతార్ లో తెలంగాణ వలస కార్మికుల కష్టాలు.... కేంద్ర్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి....


ఖతార్ లో తెలంగాణ వలస కార్మికుల కష్టాలు.... కేంద్ర్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి....


భారత దేశంలోని పలు రాష్ట్రాల నుండి  కార్మికులు వివిధ దేశాలకు పనులకు వెళ్తుంటారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల  నుండి ఎక్కువగా దుబాయ్, షార్జా, ఖతార్, కువైట్, సౌది అరేబియాలకు వెళ్తుంటారు. అందులో  భాగంగా తెలంగాణ నుండి చాలా మంది కార్మికులు ఖతార్ కి వలస వెళ్ళారు. అయితే వాళ్ళ వీసా సమయం  ముగియడంతో  అక్కడి కంపనీ వాళ్ళు ఇండియాకి తిరిగి వెళ్లాలని వారి పాస్ పోర్ట్ లు తిరిగి ఇచ్చేసారు.కానీ అదే సమయంలో వచ్చిన కరోనా మహమ్మారి  వలన ఇండియాకి రావలిసిన విమానాలు రద్దు అయ్యాయి.

ఇప్పుడు వాళ్ళు అక్కడ ఉండడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. సంపాదించుకున్న డబ్బు అంతా ఖర్చు అయిపోతుండటంతో వారు అక్కడ ఎలా ఉండాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నట్టు తెలుస్తోది. దాదాపు 3 వేల మంది దాకా తెలంగాణ కార్మికులు ఉన్నట్టు తెలుస్తోంది. వీరంతా తెలంగాణలోని జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు చెందిన వారు, కాగా  వీళ్ళంతా 2 సంవత్సరాల క్రితం ఖతార్ వెళ్ళారని సమాచారం.
వీరంతా తమను ఎలాగైనా ఇండియాకి తీసుకెళ్లాలని, తాము టికెట్  ఖర్చులు పెట్టుకుంటామని, మీరు ఫ్లైట్స్  వేయాలని  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

మరి వీరి విజ్ఞప్తిని మన్నించి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనా ప్రయత్నాలు మొదలుపెడతాయో చూడాలి.

No comments:

Post a Comment