Thursday 18 June 2020

లాక్ డౌన్ ప్రసక్తే లేదు.... నరేంద్ర మోడీ ప్రకటన.... ఇక అన్ లాక్ 2.0 ....


లాక్ డౌన్ ప్రసక్తే లేదు.... నరేంద్ర మోడీ ప్రకటన.... ఇక అన్ లాక్ 2.0 ....


ఎన్నో రోజుల నుండి సామాన్యులను కలవరపెడుతున్నది మళ్ళి లాక్ డౌన్ ఉండ్తుందా ఉండదా అని. ఎక్కడ చూసినా ఇదే చర్చ. ఉంటుందని కొందరు ఉండకపోవచ్చని కొందరు తమ వాదనలను వినిపించారు.
అన్ని అనుమానాలకు సమాధానంగా ఈరోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వివిధ రాష్ట్రాల ముఖ్యమత్రులతో సమావేశమైన సందర్భంగా, మరోసారి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేసే ప్రసక్తే లేదని ప్రకటించారు. ముఖ్యంగా ప్రధాన మంత్రి మాట్లాడుతున్నారంటే మళ్ళి లాక్ డౌన్ అమలు చేస్తారని  ప్రజలు నమ్ముతున్నారని, దీనిపై క్లారిటీ ఇవ్వాలని తెలంగాణ సీయం కేసిఆర్ మోడీని కోరగా,  దీనిపై ప్రధాని వివరించారు.

మోడీ మాట్లాడుతూ, మనం లాక్ డౌన్ 4.0 అయిపోయి  అం లాక్ 1.0 లో ఉన్నామని, అం లాక్ 2.0 ఎలా అమలు చేయాలో ఆలోచించాలని అన్నారు. ఈ విషయమై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమై  చర్చిస్తున్నామని ఆయన అన్నారు.

ఇక జూన్ 30 తరువాత ఇండియాలో లాక్ డౌన్  లేనట్టే అని స్పష్టమైంది. కానీ కొన్ని షరతులతో కూడిన  అన్ లాక్ 2.0 ప్రకటించే అవకాశం ఉంది.

No comments:

Post a Comment