Friday 29 May 2020

టాలీవుడ్ లో బాలయ్య వాఖ్యల దుమారం .... బాలయ్యపై నాగబాబు ఫైర్...


టాలీవుడ్ లో  బాలయ్య వాఖ్యల దుమారం .... బాలయ్యపై నాగబాబు ఫైర్...


సినిమా ఇండస్ట్రిలో అంతర్గత కలహాలు అనేది ఈ మధ్య మరీ సాధారణం అయిపోయాయి. ఎప్పుడైతే ఈ మా అసోసియేషన్ ప్రారంభమయిందో అప్పటినుండి టాలీవుడ్ లో   ఆర్టిస్టుల మధ్య దూరం పెరుగుతూ వస్తోంది. స్టార్ హీరోలు కూడా బాహాటంగా మాటల యుద్దాన్ని మనం ప్రత్యక్షంగా చూసాం. అందుకు ఉదాహరణ మా అసోసియేషన్  మీటింగ్ లో డా.రాజశేఖర్ చేసిన రచ్చే.  అందులో ఎంతోకొంత నిజం ఉండొచ్చు, కానీ తమను అభిమానించే అభిమానుల ముందు  హాస్యం  పాలవ్వడం ఇండస్ట్రీకి  అంత  మంచిది కాదు. మా అసోసియేషన్ ఎలెక్షన్స్, మన రాష్ట్ర  సాధారణ ఎన్నికలను తలపించిందనే చెప్పొచ్చు.

కొద్ది రోజులుగా లాక్  డౌన్ కారణంగా సినిమా ఇండస్ట్రీలో  షూటింగులు లేక, వాటిపైనే ఆడారపడే కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయమై సినీ పెద్దలు హీరోలు, దర్శకులు, నిర్మాతలు రెండు రాష్ట్ర్రాల ముఖ్యమంత్రులను సంప్రదించడం జరిగింది. దీనికి తెలంగాణ ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి పలుమార్లు సమావేశమై  సానుకూల నిర్ణయాలను తీసుకుంది. త్వరలోనే సినిమా షూటింగులకు అనుమతి ఇస్తామని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు.

అంతా బాగానే జరుగుతుంది అనేలోపే ఒక దుమారం. అదే బాలకృష్ణ వాఖ్యలు. నిన్న స్వర్గీయ నందమూరి తారక రారామారావు గారి జయంతి వేడుకల సందర్భంగా బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ హాస్పెటల్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, విలేఖరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, సినిమా షూటింగులు తిరిగి ప్రారంభం అవ్వడానికి ప్రభుత్వంతో జరిగే  సమావేశాలకు నన్ను ఒక్కరు కూడా పిలవలేదు. వీళ్ళందరూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలసి కూర్చొని హైదరాబాద్ లో భూములు పంచుకున్తున్నారా? అని బాలకృష్ణ వాఖ్యలు చేసారు. ఇప్పుడు ఈ వాఖ్యలు టాలీవుడ్ లో దుమారం లేపుతున్నాయి.

దీనికి మెగాబ్రదర్ నాగబాబు తీవ్రంగా స్పందించారు. బాలక్రిష్ణని  పిలవకపోవటం సరైనది అని నేను అనను . దానికి ఏవైనా కారణాలు ఉండొచ్చు. దానికి కారణాలు ఏమిటి అని తెలుసుకొని అడగటంలో తప్పు లేదు. కానీ భూములు పంచుకుంటున్నారని మాట్లాడడం సినీ పరిశ్రమలో ఒక నటుడిగా, నిర్మాతగా నాకు చాలా  భాద అనిపించింది. తన మాటను వెనక్కి తీసుకోవాలని, పరిశ్రమకు, తెలంగాణ ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాల్సిన భాద్యత మీది అని ఆయన తన యూట్యూబ్  చానెల్ ద్వారా స్పందించారు.

దీనికి బాలకృష్ణ ఏమైనా స్పందిస్తారా,లేక ఇండస్ట్రీ నుండి ఇంకా ఎవరైనా స్పందిస్తారా, ఇది ఇంకా ఎంత దూరం వెళుతుందో అని సినీ  వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.

No comments:

Post a Comment