Thursday 28 May 2020

ప్రపంచ రికార్డు క్రియేట్ చేసిన బుట్ట బొమ్మ పాట.


ప్రపంచ రికార్డు క్రియేట్ చేసిన బుట్ట బొమ్మ పాట.

అల వైకుంఠపురములో సినిమా పేరు చెబితే ముందుగా గుర్తుకు  వచ్చేది అందులోని పాటలు. సామజ వరగామన, రాములోరాములా, బుట్ట బొమ్మ ఈ పాటలు ఎంత ప్రజాదరణ పొందాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా విజయంలో పాటలు కీలక పాత్ర పోషించాయనే చెప్పాలి.

ఈ సినిమాలోని బుట్ట బొమ్మ పాట గురించి మాట్లాడుకుంటే, ఈ పాటను రామ  జోగయ్య శాస్రి గారు రాయగా, అర్మాన్ మాలిక్ పాడారు. ఈ పాటకు డాన్సు కంపోస్ చేసింది జానీ మాస్టర్. ఈ పాటతో పాటు ఇందులోని స్టెప్పులు కుడా బాగా పాపులర్ అయ్యాయి. ఈ పాట అంతర్జాతీయంగా ఆదరణ పొందింది. దీనికి నిదర్శనం, ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ పాటకు ఫ్యామిలీ తో కలిసి స్టెప్పులు వేసారు. దీన్ని తన టిక్ టాక్ లో షేర్ చేసారు. దాంతో ఒక్కసారిగా ఈ పాటకు అంతర్జాతీయంగా గుర్తిపు లభించింది. ఈ పాట యుట్యుబ్ లో తక్కువ సమయంలో 100 మిలియన్ల వ్యూస్ ని సాధించి  రికార్డ్  క్రియేట్ చేసింది.

దీనితో పాటు ఈ పాట మరో రికార్డును క్రియేట్ చేసింది. ప్రపంచంలో బాగా పాపులర్ అయిన 100 మ్యూజిక్ వీడియో లలో మన తెలుగు పాట బుట్ట బొమ్మ  15 వ స్థానాన్ని నిలబెట్టుకుంది. మన తెలుగు సినిమా పాటకి అంతర్జాతీయంగా అరుదైన గౌరవం దక్కిందనే చెప్పాలి. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ విషయాన్ని twitter వేదికగా పంచుకున్నారు. ఇందంతా అల్లు అర్జున్ , త్రివిక్రమ్ గార్ల వల్లనే సాధ్యమైందని ఆయన చెప్పారు.


ఇక్కడ ఇంకొక విషయం చెప్పుకోవాలి. బుట్టబొమ్మ పాట రచయిత రామ జూగయ్య శాస్త్రి గారు. ఈయన ఎన్నో  అద్భుతమైన  పాటలు  రాసారు. బుట్ట బొమ్మ పాట మ్యూజిక్ పరంగా ఎంత పాపులర్ అయిందో అందులోని లిరిక్స్ కూడా అంతే  పాపులర్ అయ్యాయి అని చెప్పొచ్చు. 

No comments:

Post a Comment