Tuesday 5 May 2020

బ్రేకింగ్ న్యూస్: తెలంగాణలో లాక్‌డౌన్ మే 29 వరకు పొడిగింపు. కేసీఆర్ ప్రకటించిన కొన్ని ప్రధాన అంశాలు ఇవే .....


బ్రేకింగ్ న్యూస్: తెలంగాణలో లాక్‌డౌన్ మే 29 వరకు పొడిగింపు.
అందరూ ఊహించినట్టుగానే తెలంగాణలో లాక్‌డౌన్ మే 29 వరకు పొడిగిస్తునట్టు సీ.యం కేసీఆర్ ప్రకటించారు.   కేసీఆర్ ప్రకటించిన కొన్ని ప్రధాన అంశాలు.


లాక్‌డౌన్ మే 29 వరకు పొడిగింపు. 

అన్ని జోన్లలో రాత్రి పూట  రాత్రి 7 నుండి ఉదయం 6 వరకు కర్ఫ్యూ కొనసాగుతుంది.

రెడ్ జోన్లలో ఎటువంటి పరిస్థితుల్లో షాపులు తెరవనివ్వం.

గ్రీన్, ఆరెంజ్ జోన్లలో అన్ని షాపులు తెరుచుకోవచ్చు.

6 రెడ్ జోన్లలో ఎటువంటి సడలింపులు ఉండవు. 

మే నెలలోనే పదవ తరగతి పరీక్షలు పూర్తి చేస్తాం.

పేదలకు పెన్షన్లు కొనసాగుతాయి.

రూ. 25 వేల లోపు రుణాలు మాఫీ చేస్తాం.

రుణ మాఫీ కోసం రేపు 1200 కోట్లు విడుదల

వర్షాకాలానికి రైతు బంధు కింద 7000 కోట్లు ఇస్తాం.    

ఇసుక మైనింగ్, వాహనాల రిజిస్ట్రేషన్లకు అనుమతి.

స్టాంప్స్ మరియు రిజిస్ట్రేషన్ పనులు కొనసాగుతాయి. 
 
భూముల అమ్మకాలు, కొనుగోళ్ళు చేసుకోవొచ్చు.  

రేపటినుండి మద్యం షాపులు తెరుచుకోనున్నాయి. 

మద్యం ధరలు 16 శాతం పెంపు. చీప్ లిక్కర్‌పై 11 శాతం పెంపు. 

హాట్ స్పాట్ ఏరియాల్లో మాత్రం మద్యం షాపులు తెరవడం జరగదు.

12 గంటలు మద్యం షాపులు తెరిచి ఉంచబడతాయి.
  
ఆర్టీసీ బస్సులు 15 వరకు తిరగడానికి అనుమతి లేదు. తరువాత పరిస్థితలనుబట్టి నిర్ణయం తీసుకుంటాం.

ఆటో రిక్షాలకు  గ్రీన్ జొన్లలోనే అనుమతి.

క్యాబులకు ఆరెంజ్ జోన్లలో అనుమతి.   

పెళ్ళిళ్ళకు 20 మంది వరకు అనుమతి.

చనిపోతే 10 మంది వరకు అనుమతి. 

No comments:

Post a Comment