Saturday, 7 November 2020

ట్రంప్ పని అయిపోయినట్టేనా! US election results

 




ఇప్పుడు ప్రపంచంలోని అన్ని దేశాలు  US election results కోసం ఎదురు  చూస్తున్నాయి.. అమెరికా అధ్యక్ష పీఠాన్ని ఎవరు కైవసం చేసుకుంటారు అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.. ఆ తరువాత జరిగే పరిణామాల గురించి అంచనాలు వేస్తున్నాయి.

అమెరికా కొన్ని కీలక రాష్ట్రాలలో తాజా ఓట్ల లెక్కింపు ప్రకారం అమెరికా అధ్యక్ష పీఠాన్ని గెలుచుకునేందుకు డెమొక్రాటిక్ నాయకుడు జో బైడెన్  మరో అడుగు ముందుకువేశారు . దాంతో ప్రస్తుత రిపబ్లికన్ అధ్యక్షుడు మళ్లీ ఎన్ని కయ్యే అవకాశాలు బాగా తగ్గిపోయినట్లుగానే కనిపిస్తోంది . బైడెన్ 264 స్థానాలను తన ఖాతాలో వేసుకున్నారు . అలా 538 ఎలెక్టోరల్ కాలేజీ ఓట్లున్న అధ్యక్ష ఎన్నికల్లో మెజారిటీకి అవసరమైన 270 సంఖ్యకు బైడెన్ దగ్గరవుతు న్నారు . ట్రంప్ ఆధిక్యం 16 ఎలెక్టోరల్ కాలేజీ ఓట్లున్న జార్జియాలో 1,902 ఓట్లకు , 20 ఎలె క్టోరల్ ఓట్లున్న పెన్సిల్వేనియాలో 42,142 కు పడిపోయింది . మొత్తానికి 214 ఎలెక్టోరల్ ఓట్లతో ట్రంప్ మెజారిటీకి దూరంలో ఉన్నారు . పరిస్థితులను చూస్తుంటే మనం చాలా బాగా ఉన్నామనిపిస్తోంది .

 

లెక్కింపు పూర్తయ్యేసరికి సెనేటర్ ( కమలా ) హారిస్ , నేను విజేతలుగా నిలుస్తామనడంలో అనుమానం లేదు అని బైడెన్ డెలావేర్ లో విలేకరులతో అన్నారు . అయితే లెక్కింపు కొనసాగుతోంది . కనుక అమె రికన్లు ప్రశాంతంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు . ఇక ఎన్నికలలో జరిగిన అవకతవకల గురించి తాను న్యాయస్థానానికి వెళ్తానని వైట్ హౌజ్ దగ్గర జరిగిన విలేకరుల సమావేశంలో ట్రంప్ పేర్కొన్నారు . పెన్సిల్వేనియా , మిషిగన్ , జార్జి యా , నెవడా రాష్ట్రాలలో ట్రంప్ బృందం ఇప్పటికే కేసులు దాఖలు చేసింది . ఇక విస్కాన్సిన్ లో ఓట్లను మళ్లీ లెక్కించాలని ట్రంప్ డిమాండ్ చేశారు . ఓట్ల లెక్కింపును ఆపేందుకు డొనాల్డ్ ట్రంప్ న్యాయస్థానాలకు వెళ్తున్నారు . మళ్లీ పోరా డేందుకు చరిత్రలోనే అతిపెద్ద ఎన్నికల రక్షణ వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకున్నాం . అందు కు మీ సహకారం అవసరం అని ట్రంప్ వైట్ హౌజ్ వార్తల సమావేశం తర్వాత బైడెన్ ట్వీట్ చేశారు .

 

డెమొక్రాట్లు ప్రజాస్వామ్యాన్ని దొంగిలి స్తున్నారని ట్రంప్ ఆరోపించారు . ఎన్నికల సమ గ్రతను పరిరక్షించడమే మన లక్ష్యం . ఇంతటి ప్రధానమైన ఎన్నికలో అలా దొంగిలించేందుకు పాల్పడే అవినీతిని మనం ఆమోదించం . ఇంకా ఎవ్వరూ మన ఓటర్ల గొంతు నొక్కకుండా , ఫలితా లను వండివార్చకుండా మనం ఎవ్వరినీ అనుమ తించం అని ట్రంప్ విలేకరులతో అన్నారు . ఇ క్కడ బ్రహ్మాండమైన వివాదం నడుస్తోంది . ఇది ఎన్నికలలో దొంగతనానికి ప్రయత్నిస్తున్న వారికి సంబంధించింది అని అధ్యక్షుడు పేర్కొన్నారు . ఈ వ్యాఖ్యలను బైడెన్ ఖండించారు . మననుంచి ప్రజాస్వామ్యాన్ని ఎవ్వరూఎత్తుకు వెళ్లట్లేదు . ఇప్పు డే కాదు , ఎప్పటికీ కూడా . అమెరికా చాలా దూరం ప్రయాణించింది . ఎన్నో యుద్ధాలలో పోరాడింది . పోరాడేందుకు మనకు ఎంతో ఓపిక ఉంది అని మరో ట్వీట్లో బైడెన్ పేర్కొన్నారు .

 

ట్రంప్ వ్యాఖ్యలు తప్పన్న అమెరికా మీడియా  ద న్యూ యార్క్ టైమ్స్ ప్రకారం ట్రంప్ చేస్తున్న తప్పుడు " ప్రకటనల నుంచి ప్రధాన వార్తల ఛానెళ్లయిన ఎబిసి , సిబిఎస్ , ఎబిసి అన్నీ కూడా దూరం జరిగాయి . నిర్ణయాత్మకమైన రాష్ట్రాలలో ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నందు వల్ల బైడెన్ దారి స్పష్టంగా కనిపిస్తోంద ని ద వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది . మోసం లేదా అవినీతికి సంబం ధించి ఎలాంటి ఆధారాలూ లేవు ” ( దేర్ ఈజ్ జీరో- జీరో ఎవిడెన్స్ ఆఫ్ ఫ్రాడ్ ఆర్ కరప్షన్ ) అని వాషింగ్టన్ పోస్ట్ తన సంపాదకీయంలో వెల్లడించింది . ట్రంప్ అనైతికంగా భావిస్తున్నదంతా ఆయనకు బాధ కలిగించేదే అయినప్పటికీ అది సహజమే : ఆయన ఓడిపోతున్నారు . ఎన్నికల రాత్రి కొన్ని రాష్ట్రాల్లో పాక్షికమైన లెక్కింపులో ఆయన ఆధి క్యంలో కొనసాగారు . అయితే , ఈ - మెయిల్ ఓట్ల లెక్కింపు మొదలుకాగానే , ఆయన చెప్పినట్లుగానే ఆయన ఆధిక్యం తగ్గిపోయింది అని అది పేర్కొంది .

 

ఎన్నికలకు ముందు ఈ- మెయిల్ ఓటింగ్ గురించి ట్రంప్ మరీ ఎక్కువగా విమర్శిం చారు . దాంతో కొంతమంది రిపబ్లికన్లు మాత్రమే ఆయనకు ఓటువేశారు . అందుకే మెయిల్ బ్యాలె ట్లలో ఎక్కువగా డెమొక్రాట్ జో బైడెన్ వైపు మొగ్గు చూపాయి . అందుకే ట్రంప్ చెప్పిన అబద్ధాలకు భిన్నంగా పరిశీలకులు చూస్తుండగా , రిపబ్లికన్ , డెమొక్రాటిక్ రెండు పార్టీల ఎన్నికల అధికారుల సమక్షంలో , నియమాల ప్రకారమే అధికారులు ఓట్లు లెక్కిస్తున్నారు అని వాషింగ్టన్ పోస్ట్ వ్యాఖ్యానించింది .

ఇక ఇండియా విషయానికి వస్తే, ఇండియా కూడా US election results ని ఆసక్తిగా పరిశీలిస్తోందని చెప్పొచ్చు. కరోనా సమయంలో భారత్, అమెరికా మద్య సంబంధాలు కొంత వరకు అనుకూలంగా మారాయని చెప్పొచ్చు. అయితే  ఈ ఫలితాల తరువాత భారత్ , అమెరికా మద్య సంబంధాలలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి అనేదానికోసం  వేచి చూడాల్సిందే.

No comments:

Post a Comment