Saturday 7 December 2019

ఇక నో బాల్స్ బాద్యత థర్డ్ అంపైర్‌దే



ఇక నో బాల్స్ బాద్యత థర్డ్ అంపైర్‌దే 

ఐసీసీ భారత్ మరియు వెస్టిండీస్ మద్య జరిగే టీ 20 సీరిస్‌లో కొత్త విధానాన్ని  ప్రయాగోత్మకంగా పరిశీలిస్తోంది. అదేంటంటే ఇక పై ఫ్రంట్ ఫుట్  నోబాల్స్‌పై  మైదనంలో అంపైర్ కాకుండా ధర్డ్ అంపైర్ నిర్ణయం  తీసుకుంటాడని ఐసీసీ ప్రకంటించింది. " ఈ విధానం అమలులో ఉన్నంత వరకు ప్రతి బంతిని పర్యవేక్షించే బాద్యత థర్డ్ అంపైర్‌దే, బౌలర్ ఫ్రంట్‌ఫుట్ నోబాల్ వేసాడా లేదా అన్నది చూడాల్సింది అతడే అని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. 

నోబాల్‌ని థర్డ్ అంపైర్ మైదానంలో అంపైర్‌కి ఆ విషయాన్ని చెప్పక మాత్రమే, మైదానంలోని అంపైర్ నోబాల్‌గా ప్రకటించాలి. థర్డ్ అంపైర్  ప్రకటించకుండా మైదానంలో అంపైర్ నోబాల్‌ని ఇవ్వడానికి అవకాశం  లేదు. 

 ఈ కొత్త  విధానం ఎంతవరకు విజయవంతమవుతుందో చూడాలి.      

No comments:

Post a Comment